సాక్షి, విశాఖపట్నం: మళ్లీ విశాఖలో సినిమా షూటింగ్ సందడి మొదలైంది. అన్‌లాక్‌తో నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టు లు కూడా విశాఖ వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో కొంత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. నీటి సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది. 1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి... ఇలా భిన్న మైన ప్రకృతి అందాల తో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. (చదవండి: తెలుగు హీరోలకు మంచి రోజులు)
మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చిన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి బాలకృష్ణ అయితే సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ వంటి సినిమాలో సింహాచలం కేంద్రంగానే సెంటిమెంట్‌గా కొనసాగాయి. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణ గాడు వీర ప్రేమ కథ ఇలాంటి సినిమాలో ఇక్కడే పురుడు పోసుకున్నాయి. కోవిడ్ కారణంగా షూటింగ్ సందడి తగ్గింది. ముఖ్యంగా బీచ్‌ను అనుకునే రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిస్సా బెంగాలీ,అసామి లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా నిలిచాయి. ఈ దశలో దాదాపు ఐదు నెలల తర్వాత అన్‌లాక్ ప్రక్రియ మొదలవడంతో విశాఖలో సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్)
ఐపీఎల్ అనే ఓ చిత్రానికి గత మూడు రోజులుగా ఆర్కే బీచ్, వుడా పార్క్ పరిసరాలలో జోరుగా షూటింగ్ జరుగుతుంది. విశాఖ పరిసరాలు షూటింగులకు అనువైన ప్రాంతాలని ఐపీఎల్ నటీనటులు పేర్కొన్నారు. విశాఖ అరకు పరిసరాల్లో తమ సినిమా షూటింగ్ కూడా కొనసాగిస్తున్నట్టు వివరించారు. విశాఖలో షూటింగ్‌లతో పాటు పర్యాటకులు తాకిడి కూడా పెరిగింది.నిజానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమ విశాఖ వస్తే అన్ని రకాల మౌలిక సదుపాయాలు రాయితీలు ఇస్తామని ప్రకటించారు. దీనిపై సినీరంగంలోని అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి ఈ దశలో కోవిడ్ అన్‌లాక్ ఈ ప్రక్రియ మొదలు కావడంతో సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment