
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా సడలిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆన్‌లాక్ 3.o ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3 నిబంధనల ప్రకారం ఆంధ్రపప్రదేశ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బీ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ, ‘ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ- పాస్ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే . ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారు. రేపటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది’ అని తెలిపారు. చదవండి: నేడు తెరుచుకోనున్న ద్వారక ద్వారాలు
Comments
Please login to add a commentAdd a comment