సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్లో మిడ్‌రేంజ్‌లో 'జెడ్5' పేరుతో మంగళవారం బీజింగ్‌లో విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఇవి లభ్యంకానుంది. 64జీబీ వెర్షన్ 1399 యువాన్ (రూ .14,670 సుమారు) 128 జీబీ వెర్షన్ 1799 యువాన్ (రూ .18,870)గా నిర్ణయించింది. ఇది ప్రీబుకింగ్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులో వుండగా, జూన్ 12 నుండి విక్రయానికి లభ్యం కానుంది. ఆకట్టుకునే రంగులతోపాటు అద్భుత డిజైన్‌తోప్రీమియం లుక్ వచ్చేలా ఈ డివైస్‌ను డిజూన్ చేసింది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కూడా జోడించింది.
లెనోవో జెడ్5 ఫీచర్లు
6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2246 x 1080 స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,
16+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment