బంగారం: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌ | Gold Price Falls For 4th Day Touches 6 Month Low Here Is The Reason | Sakshi
Sakshi News home page

Gold Price: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌

Published Sat, Sep 17 2022 11:41 AM | Last Updated on Sat, Sep 17 2022 3:11 PM

Gold Price Falls For 4th Day Touches 6 Month Low Here Is The Reason - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో పసిడి రేట్లు కొనుగోలు దారులకు  ఊరట నిస్తున్నాయి.  బలపడుతున్న డాలర్ విలువ, ఫెడరల్ రిజర్వ్  భారీ  వడ్డీ రేటు పెంపు అవకాశాల నడుమ  బంగారానికి డిమాండ్‌  తగ్గింది. ఫలితంగా వరుసగా నాలుగో రోజు (సెప్టెంబర్ 16, 2022) బంగారం వెండి ధరలు పడిపోయాయి. దీంతో పసిడి ధర ఆరు నెలల కనిష్టానికి దిగి వచ్చింది. అయితే రానున్న ఫెస్టివ్‌ సీజన్‌,  ముఖ్యంగా దీపావళికి నాటికి దేశంలో  మరింత దిగి వచ్చే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. (Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్‌ కమింగ్‌ సూన్‌)

తాజాగా సెప్టెంబర్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై  రూ. 400కు పైగా తగ్గింది. ప్రస్తుతం 5 వేల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉంది. అలాగే ఉదయం వెండి కిలో ధర రూ.600  మేర దిగి వచ్చింది. ఇపుడు స్వల్పంగా పుంజుకుని కిలో 56,700 వద్ద ఉంది.  

ఇక గ్లోబల్‌గా నిరాశపరిచిన అమెరికా సీపీఐ డేటా తర్వాత, బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే ఆగస్ట్‌లో యూఎస్‌ ద్రవ్యోల్బణం 8.1 శాతంగానమోదైంది.దీంతో వచ్చే నెలలో జరగబోయే ఫెడ్‌ సమావేశంలో 100 బీపీఎస్‌ వడ్డీ రేటు పెంపుపై ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధర 10 గ్రాములకి 1,187 (2.35 శాతం) పతనమై 49,334 స్థాయికి చేరింది. స్పాట్ మార్కెట్‌లో గోల్డ్‌ ధర శుక్రవారం 1,654డాలర్ల వద్ద 2 సంవత్సరాల కనిష్టాన్ని తాకింది.చివర్లోకాస్త పుంజుకుని ఔన్సుకు 1,674 డాలర్లుగా ఉంది. బంగారం ధర పతనానికి గల కారణాలపై ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అనూజ్‌ గుప్తా మాట్లాడుతూ తాజా పరిణామాలతో పెట్టుబడిదారులు అమెరికా డాలర్ వైపు మళ్లుతున్నారని, యుఎస్ ఫెడ్ సమావేశం ముగిసేవరకు ఈ రెండు ట్రిగ్గర్లు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయన్నారు.

ఇదీ  చదవండి:  Johnson & Johnson: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement