బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వు వడీ ్డరే ట్లను యథాస్థితిలో కొనసాగించడం, దేశీ డిమాండ్ పెరుగుదల వంటి కారణాల వల్ల గతవారం బంగారం ధరల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. గతవారంలో పండుగ సీజన్ వల్ల డిమాండ్ పెరగడం వల్ల బంగారం ధర రూ.26,000 మార్క్‌ను అధిగమించింది. అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్‌లో బంగారం ధర అంతక్రితం వారంతో పోలిస్తే 34 డాలర్ల మేర బలపడి ఔన్స్‌కు 1,137 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయంగా చూస్తే.. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర అంతక్రితం వారం ముగింపు ధర రూ.26,110తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,490 వద్ద ముగిసింది. అలాగే 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా అంతక్రితం వారం ముగింపు ధర రూ.25,960తో పోలిస్తే రూ.380 పెరిగి రూ.26,340 వద్ద స్థిరపడింది.