న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణాన్ని కిందకు దింపడం, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా తమ విధానం ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత స్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రస్తుత సంస్కరణలు కొనసాగుతాయని, వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అమెరికా ఫెడ్ ట్యాపరింగ్ ప్రభావం పడని దేశంగా భారత్ నిలబడిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకుల మొండిబకాయిలు తగ్గించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.