
రుపీకి మరింత పతనం తప్పదట!
ఫెడ్ అంచనాలతో విలవిల్లాడుతున్న దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ డ్యుయిష్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది.
ముంబై: ఫెడ్ అంచనాలతో విలవిల్లాడుతున్న దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ డ్యుయిష్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. గత శుక్రవారం రికార్డు స్థాయి పతనంతో 37 నెలల కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి .ఇకముందు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని చెప్పింది. 2017 చివరి నాటికి డాలర్ మారకపు విలువలో 72.5 స్తాయికి దిగజార వచ్చని అంచనావేసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భారీగా పెంచనుందన్న బలమైన అంచానాలతో కరెన్సీ మార్కెట్ల మరింత బలహీనం కానున్నాయని చెప్పింది. ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీ పతనానికి ప్రధాన కారణమని పేర్కొంది. అలాగే రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూపాయి విలువను స్థిరీకరించేందుకు మార్కెట్లో జోక్యం చేసుకున్నప్పటికీ , డాలర్ పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో నామమాత్రపు చర్యలు సరిపోవని డ్యుయిష్ బ్యాంక్ విశ్లేషకులు తెలిపారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పడిపోవడం బలహీన సంకేతమేని డ్యుయిష్ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన నోట్ లో హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం అనంతరం అమెరికా బాండ్ వ్యాపారం 10 సం.రాల గరిష్టానికి ఎగబాకడం, డీమానిటైజేషన్ తరువాత భారత బాండ్ మార్కెట్ గణనీయం పడిపోయిందని వ్యాఖ్యానించింది.
కాగా రూపాయి గురువారం బుధవారం ట్రేడింగ్ లో 68,86 రికార్డు స్థాయికి దిగజారింది. రూపాయి మద్దతునిచ్చేందకు ఆర్ బీఐ చర్యలతో 68,47 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 17,262.32 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన సంగతి తెలిసిందే.