Deutsche Bank
-
భారత్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ దూసుకుపోతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదయ్యింది. ఎస్బీఐ రీసెర్చ్, జర్మనీ బ్రోకరేజ్– డాయిష్ బ్యాంక్ వంటి సంస్థలు 7 శాతం వరకూ వృద్ధి అంచనాలను వెలువరించాయి. తాజా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.6 శాతం నమోదవుతుందని విశ్వసిస్తున్నట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకటించింది. ఈ మేరకు తన రెండవ అడ్వాన్స్ అంచనాలను వెలువరించింది. మొదటి అడ్వాన్స్ అంచనాలు 7.3 శాతం. సమీక్షా కాలంలో (క్యూ3)లో తయారీ, మైనింగ్ అండ్ క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కాగా, వ్యవసాయ రంగం తీవ్ర విచారకరమైన రీతిలో 0.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. ఇదిలావుండగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (క్యూ3) వృద్ధి రేటు 4.3 శాతం. క్యూ1, క్యూ2 శాతాలు అప్.. 2022–23 వృద్ధి అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎన్ఎస్ఓ తగ్గించడం మరో అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఒకటి, రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి అంకెలు వరుసగా 7.8 శాతం (క్యూ1), 7.6 శాతాలుగా (క్యూ2)నమోదయ్యాయి. అయితే ఈ అంకెలను ఎగువముఖంగా 8.2 శాతం, 8.1 శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించడం మరో సానుకూల అంశం. తాజా ప్రోత్సాహకర ఫలితంతో 2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఎకానమీ 8.2 శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 7.3 శాతం. 8.4 శాతం వృద్ధి ఎలా అంటే.. 2022–23 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ... 2011–12 బేస్ ఇయర్ ప్రాతిపదిక వాస్తవిక జీడీపీ) రూ.40.35 లక్షల కోట్లు. తాజా 2023–24 ఇదే త్రైమాసికంలో ఈ విలువ 43.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే అంకెల్లో వృద్ధి 8.4 శాతం అన్నమాట. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోని కరెంట్ ప్రైస్ ప్రకారం ఈ విలువ రూ.68.58 లక్షల కోట్ల నుంచి రూ.75.49 లక్షల కోట్లకు ఎగసింది. ఈ ప్రాతిపదిక వృద్ధి రేటు 10.1 శాతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 7.6 శాతం అంచనాలు చూస్తే.. (వాస్తవ వృద్ధి) జీడీపీ విలువ రూ.160.71 లక్షల కోట్ల నుంచి రూ.172.90 లక్షల కోట్లకు పెరగనుంది. కరెంట్ విలువ ప్రాతిపదికన ఈ వృద్ధి అంచనా 9.1 శాతంగా ఉంది. విలువల్లో రూ.269.50 లక్షల కోట్ల నుంచి రూ.293.90 లక్షల కోట్లకు జీడీపీ విలువ పెరగనుంది. జనవరిలో మౌలిక రంగం నిరాశ 8 పరిశ్రమల గ్రూప్ 3.6 శాతం వృద్ధి ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయిలో 3.6 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. 2023 జనవరిలో ఈ రేటు 4.9 శాతం. ఏప్రిల్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 40 శాతం. సమీక్షా కాలంలో రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువుల రంగాల్లో వృద్ధి లేకపోగా, క్షీణత నమోదయ్యింది. బొగ్గు, స్టీల్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మందగించింది. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు, సిమెంట్ రంగాల్లో వృద్ధి రేటు సానుకూలంగా ఉంది. తలసరి ఆదాయాలు ఇలా... మరోవైపు వాస్తవ గణాంకాల (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని) ప్రాతిపదికన 2021–22లో దేశ తలసరి ఆదాయం రూ.1,50,906కాగా, 2022–23లో ఈ విలువ రూ. 1,69,496కు ఎగసినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. కరెంట్ ప్రైస్ ప్రకారం చూస్తే ఈ విలువలు రూ.1,05,092 నుంచి రూ.1,18,755కు ఎగశాయి. -
ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..!
జర్మనీలో అతిపెద్ద లెండర్ 'డ్యుయిష్ బ్యాంక్' తాజాగా 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు భారీగా తగ్గిపోవడం వల్ల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 కంటే కూడా 2023లో సంస్థ లాభాలు 16 శాతం తగ్గడం మాత్రమే కాకుండా, ఖర్చులు పెరగడం వల్ల డ్యుయిష్ బ్యాంక్ 3500 మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆదాయం సంవత్సరానికి ఆరు శాతం పెరిగి 28.9 బిలియన్ యూరోలకు చేరుకుందని, అనిశ్చితి వాతావరణంలో కూడా బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'క్రిస్టియన్ సివింగ్' ప్రశంసించారు. కానీ బ్యాంక్ మరింత లాభాలను పొందే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని వెల్లడించారు. ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు! 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్యుయిష్ బ్యాంక్ 85000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లేఆప్స్ చేస్తున్నట్లు సమాచారం. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
ద్రవ్యోల్బణంపై రుతుపవనాల ప్రభావం
ముంబై: భారత్‌లో రుతువవనాలు ఆలస్యం అవ్వడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని జర్మనీకి చెందని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. మే నెల ద్రవ్యోల్బణం డేటా శాంతించినట్టు అధికారిక గణాంకాలు చూపించినా కానీ, ఈ విషయంలో సంతృప్తి చెందడానికి లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202324)లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఇది ఆర్బీఐ అంచనా 5.1 శాతానికి దగ్గరగానే ఉంది. విశ్లేషకులు అయితే 5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘రుతుపవన వర్షాలు ప్రస్తుతం సాధారణ స్థాయికి 53 శాతం తక్కువగా ఉన్నాయి. వర్షపాతం బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం ధరలు పెరిగిపోతాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. అందుకని, భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం రిస్క్‌ల విషయంలో ఇప్పటి వరకైతే సంతృప్తికి అవకాశం లేదు’’అని డాయిష్ బ్యాంక్ తెలిపింది. జూలై, ఆగస్ట్‌లో ఆహార ధరలు పెరగకుండా, అదృష్టం తోడయితేనే రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతం, అంతకంటే తక్కువలో ఉండొచ్చని పేర్కొంది. వర్షాకాలంలో జూలై నెల కీలకమని, సాధారణంగా ఆహార ధరలు ఈ నెలలోనే ఎక్కువగా పెరుగుతాయని వివరించింది. చివరిగా 2009, 2014 సంవత్సరాల్లో వర్షాలు తక్కువగా ఉన్న సందర్భాల్లో జూలైలోనే ధరలు అధికంగా పెరిగినట్టు గుర్తు చేసింది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవన సీజన్లో 53 శాతం వర్షపాతం తక్కువగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం. కూరగాయాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటోల ధరలు రానున్న నెలల్లో గణనీయంగా పెరగొచ్చని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. 2023లో ఎల్‌నినో రిస్క్ ఉన్నందున వర్షాలు ఆలస్యంగా రావడం ద్రవ్యోల్బణం పరంగా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. వృద్ధిపైనా ప్రభావం రుతుపవనాలు బలహీనంగా ఉంటే అది దేశ జీడీపీ వృద్ధిపైనా ప్రభావం చూపించొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. వర్షాలు నిరాశపరిచి, వ్యవసాయ వృద్ధి 2004, 2009, 2014 కరువు సంవత్సాల్లో మాదిరే 1 శాతం స్థాయిలో ఉంటే, జీడీపీ వృద్ధి 0.30 శాతం తగ్గిపోవచ్చని అంచనా వేసింది. -
డాయిష్ బ్యాంక్ 14% డౌన్
ఫ్రాంక్ఫర్ట్: అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ షేర్లపైనా ప్రభావం పడింది. బ్యాంకు షేర్లు శుక్రవారం ఒక దశలో 14 శాతం క్షీణించాయి. ఆ తర్వాత కొంత కోలుకుని సుమారు 9 శాతం క్షీణతతో 8.52 యూరోల వద్ద ట్రేడయ్యాయి. బాండ్లను బీమా చేసేందుకయ్యే వ్యయాలు పెరిగిపోవడం డాయిష్ బ్యాంక్ పరిస్థితిపై ఆందోళనకు కారణమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇటీవల స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూసీ పతనానికి ముందు కూడా ఇలాంటి పరిణామమే చోటు చేసుకోవడం గమనార్హం. అయితే డాయిష్ బ్యాంక్ మరో క్రెడిట్ సూసీ కావచ్చన్న ఆందోళనలను జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ తోసిపుచ్చారు. బ్యాంక్ పటిష్టంగానే ఉందని స్పష్టం చేశారు. -
పెంపు ఇక నిదానమే!
ముంబై: రెపో రేటు పెంపు విషయంలో ఆర్బీఐ ఇకమీదట దూకుడుగా వ్యవహరించకపోవచ్చని డాయిష్ బ్యాంకు అంచనా వేసింది. రేటును పావు శాతం మేర పెంచొచ్చని పేర్కొంది. మే నుంచి ఇప్పటి వరకు మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును ఆర్బీఐ పెంచడం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం గరిష్ట పరిమితి దాటిపోవడంతో కట్టడి చేయడాన్ని ప్రాధాన్యంగా భావించి వరుసగా రేట్లను పెంచుతూ వస్తోంది. ఇక నుంచి రేట్ల పెంపు నిదానంగా ఉండొచ్చని డూచే బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ ఆగస్ట్ సమీక్ష మినిట్స్ విడుదల కాగా, దీని ఆధారంగా ఈ అంచనాలకు వచ్చింది. క్రమబద్ధంగా, చురుగ్గా చర్యలు ఉండాలన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటన కీలకమైనదిగా పేర్కొంది. ఆర్బీఐ ఈడీ రాజీవ్ రంజన్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని డాయిష్ గుర్తు చేసింది. మానిటరీ పాలసీ స్థిరత్వం కోసం మరిన్ని రేట్ల పెంపులు ఉంటాయని ఆర్బీఐ మినిట్స్ ఆధారంగా తెలుస్తున్నట్టు దేశీ బ్రోకరేజీ సంస్థ కోటక్ సెక్యూరిటీస్ సైతం తెలిపింది. రెపో రేటు 5.75–6 శాతానికి చేరొచ్చన్న తన అంచనాలను కొనసాగించింది. రెపో రేటు 5.75 శాతం వద్ద స్థిరపడొచ్చని ఎంకే గ్లోబల్ అంచనాగా ఉంది. ప్రస్తుతం రెపో రేటు 5.4 శాతం వద్ద ఉంది. -
గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?!
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని తొలి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్(ఐఎఫ్ఎస్సీ)లో బ్యాంకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్‌కు తాజాగా అనుమతి లభించింది. ఇందుకు గిఫ్ట్(జీఐఎఫ్‌టీ) ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) అథారిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి గిఫ్ట్ సిటీ సెజ్‌లో డాయిష్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ బ్యాంకింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. కాగా.. డాయిష్ బ్యాంక్‌కు అనుమతి నేపథ్యంలో మరిన్ని విదేశీ దిగ్గజాలు గిఫ్ట్ సిటీవైపు దృష్టిసారించే వీలున్నట్లు తపన్ రాయ్ పేర్కొన్నారు. దీంతో విదేశీ బ్యాంకులకు ఎఫ్‌పీఐ, ఎన్డీఎఫ్, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ తదితర పలు బిజినెస్ అవకాశాలు లభించనున్నట్లు గిఫ్ట్ సిటీ గ్రూప్ ఎండీ, సీఈవో రాయ్ వివరించారు. ప్రధానంగా ఫైనాన్సింగ్, ట్రేడ్, కరెన్సీలు తదితర విభాగాలలో తమ క్లయింట్లకు అంతర్జాతీయ బిజినెస్ లావాదేవీల నిర్వహణకు ఈ యూనిట్ సహకరించనున్నట్లు డాయిష్ బ్యాంక్ సీఈవో కౌశిక్ షపారియా తెలియజేశారు. ఇప్పటివరకూ దేశీ కార్యకలాపాలపై రూ. 19,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. గిఫ్ట్ సిటీలో 2015లో ఏర్పాటైన ఐఎఫ్ఎస్సీ ఫైనాన్షియల్ రంగంలోని పలు దేశ, విదేశీ సంస్థలను ఆకట్టుకుంటోంది. -
ఆ బ్యాంకులో 10వేల ఉద్యోగాల కోత
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన అతిపెద్ద బ్యాంకు డాయిష్ బ్యాంక్ భారీగా ఉద్యోగులపై వేటువేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుమారు పదివేల ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకు సీఈవోగా క్రిస్టియన్ సెవింగ్ నియమితులైన ఒక నెలరోజుల్లోనే ఈ కీలక నిర్ణయం వెలువడింది. అతి కఠినమైన పరిస్థితులు, నిర్ణయాలు ముందున్నాయని ఇప్పటికే బ్యాంకు వాటాదార్ల సమావేశంలో హెచ్చరించిన సీఈవో, కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తమ ఉద్యోగుల్లో దాదాపు 10శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలను 10 శాతం అంటే 117 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8 లక్షల కోట్లు) మేర తగ్గిస్తున్నట్లు యురోపియన్ ఫైనాన్షియల్ సర్వీస్ మేజర్ డాయిస్ తెలిపింది. పునర్నిర్మాణ పథకంలో వ్యయాల్లో కోత పెట్టడం తద్వారా బ్యాంకును లాభాల్లోకి తెచ్చేందుకు సాధ్యమైన యత్నాలన్నీ చేస్తామని, కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టియన్ సెవింగ్ హామీ ఇచ్చిన రోజే, ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయి ఉద్యోగులు 97,000 మంది ఉన్నారని, 10శాతం కోతతో ఈ సంఖ్యను సుమారు 90,000కు పరిమితం చేస్తామని బ్యాంక్ తెలిపింది. ఇప్పటికే ఈ తొలగింపు ప్రారంభమైందని వెల్లడించింది. ఈక్విటీలు, విక్రయాల విభాగాల్లోనే నాలుగోవంతు తొలగింపులుంటాయని, పనితీరు బాగాలేని వారిపై వేటు పడుతుందని స్పష్టం చేసింది. ఐరోపాలో రిటైల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా కార్యకలాపాలుంటాయని, కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామనీ వివరించింది. ఈ వార్తలతో ప్రాంక్ఫర్ట్ మార్కెట్లో డాయిష్ బ్యాంకు షేరు 6శాతం కుప్పకూలింది. -
ఈ దేశాల్లో ఐఫోన్లు చాలా ఖరీదైనవి!
ఐఫోన్ బ్రాండు అంటేనే.. కొంచెం ఖరీదైనది. వాటిని కొనాలంటే డబ్బులెక్కువ వెచ్చించాల్సిందే. అయితే బ్రెజిల్, ఇండియా, స్వీడన్, డెన్మార్క్ లేదా ఇటలీ వెళ్లినప్పుడు అసలు ప్రయాణికులు తమ ఐఫోన్లను చేజార్చుకోవద్దని డ్యుయిస్ బ్యాంకు చెబుతోంది. ఎందుకో తెలుసా? ఈ దేశాల్లో ఐఫోన్ ధరలు భారీగా ఉంటాయట. ఒకవేళ ఈ దేశాల ప్రయాణంలో ఐఫోన్లను పోగొట్టుకుంటే, మళ్లీ దాన్ని కొనుకోవాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేనని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తుల ధరలతో డ్యుయిస్ బ్యాంకు ప్రతేడాది ఓ వార్షిక రిపోర్టు తయారుచేస్తోంది. ఈ రిపోర్టులో గ్లోబల్ సిటీలోని 20కి పైగా కామన్ ఉత్పత్తుల ధరలను ఇతర దేశాలతో పోల్చి చూపిస్తోంది. ఈ మేరకు డ్యుయిస్ బ్యాంకు 2016 సంవత్సరానికి గాను విడుదల చేసిన రిపోర్టులో ఐఫోన్ ఏయే దేశాల్లో అత్యంత ఖరీదైనదో వెల్లడించింది. బ్రెజిల్ స్థానిక కరెన్సీతో పోలిస్తే అమెరికా డాలర్ల విలువ గతేడాది కంటే దిగొచ్చింది. కానీ ఐఫోన్ ధర మాత్రం బ్రెజిల్లో తగ్గలేదని తెలిపింది. ఐఫోన్ ధరలు అత్యధికంగా ఉన్న టాప్ దేశాలు దేశం 2016 ధర(డాలర్లలో) బ్రెజిల్ 931 ఇండోనేషియా 865 స్వీడన్ 796 ఇండియా 784 ఇటలీ 766 -
రుపీకి మరింత పతనం తప్పదట!
-
రుపీకి మరింత పతనం తప్పదట!
ముంబై: ఫెడ్ అంచనాలతో విలవిల్లాడుతున్న దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ డ్యుయిష్ బ్యాంక్ అభిప్రాయపడుతోంది. గత శుక్రవారం రికార్డు స్థాయి పతనంతో 37 నెలల కనిష్టాన్ని నమోదు చేసిన రూపాయి .ఇకముందు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని చెప్పింది. 2017 చివరి నాటికి డాలర్ మారకపు విలువలో 72.5 స్తాయికి దిగజార వచ్చని అంచనావేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భారీగా పెంచనుందన్న బలమైన అంచానాలతో కరెన్సీ మార్కెట్ల మరింత బలహీనం కానున్నాయని చెప్పింది. ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం దేశీయ కరెన్సీ పతనానికి ప్రధాన కారణమని పేర్కొంది. అలాగే రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) రూపాయి విలువను స్థిరీకరించేందుకు మార్కెట్లో జోక్యం చేసుకున్నప్పటికీ , డాలర్ పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో నామమాత్రపు చర్యలు సరిపోవని డ్యుయిష్ బ్యాంక్ విశ్లేషకులు తెలిపారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పడిపోవడం బలహీన సంకేతమేని డ్యుయిష్ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన నోట్ లో హెచ్చరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం అనంతరం అమెరికా బాండ్ వ్యాపారం 10 సం.రాల గరిష్టానికి ఎగబాకడం, డీమానిటైజేషన్ తరువాత భారత బాండ్ మార్కెట్ గణనీయం పడిపోయిందని వ్యాఖ్యానించింది. కాగా రూపాయి గురువారం బుధవారం ట్రేడింగ్ లో 68,86 రికార్డు స్థాయికి దిగజారింది. రూపాయి మద్దతునిచ్చేందకు ఆర్ బీఐ చర్యలతో 68,47 వద్ద స్థిరపడింది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు 17,262.32 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన సంగతి తెలిసిందే. -
‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?
-
‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా?
14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్న అమెరికా న్యాయ శాఖ • డాయిష్ బ్యాంకు తాకట్టు సెక్యూరిటీల విక్రయంపై దర్యాప్తు • కేసు పరిష్కారం కోసం జరిమానా చెల్లించాలని డిమాండ్ • అంత చెల్లించేది లేదన్న జర్మనీ బ్యాంకు పరిష్కారం కోసం చర్చలు • మరో ఆర్థిక సంక్షోభంపై ఇన్వెస్టర్లలో ఆందోళనలు • ఆ పరిస్థితి రాదంటున్న నిపుణులు న్యూయార్క్: ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక రంగం ఇంకా కోలుకునే ప్రయత్నాల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డాయిష్ బ్యాంకు 14 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలంటూ అమెరికా న్యాయశాఖ చేసిన డిమాండ్‌తో ఇటీవల ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. 2008లో అమెరికాకు చెందిన ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం లెహమాన్ బ్రదర్స్ కుప్పకూలడమే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది. 619 బిలియన్ డాలర్ల రుణాలతో లెహమాన్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. తాజా పరిణామాలను చూస్తే జర్మనీకి చెందిన నాలుగో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ కూడా లెహమాన్ బ్రదర్స్ మాదిరిగా చేతులెత్తేస్తుందేమో?, మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలు బయల్దేరాయి. మరి ఈ అంశం చివరికి ఎటు దారి తీస్తుంది...? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. జరిమానా ఎందుకు? 2008కి ముందు తన వద్ద తనఖా ఉంచిన సెక్యూరిటీలను డాయిష్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు పరిష్కారం కోసం 14 బిలియన్ డాలర్లు చెల్లించాలన్నది అమెరికా న్యాయ శాఖ తాఖీదు. కానీ, అంత భారీ మొత్తంలో చెల్లించే ప్రశ్నే లేదని డాయిష్ బ్యాంకు స్పష్టం చేసింది. ఆందోళనలు జరిమానా భారీ స్థాయిలో ఉండడంతోపాటు డాయిష్ బ్యాంకు బ్యాలన్స్ షీటు బలహీనంగా ఉండడంతో లెహమాన్ బ్రదర్స్ వైఫల్యం చెందిన రోజులు ఇన్వెస్టర్లకు గుర్తుకు వచ్చాయి. ఫలితంగా వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ఈ కథనం ప్రచురితమైన రోజే డాయిష్ బ్యాంకు షేరు ధర 8 శాతం పడిపోగా, బ్యాలన్స్ షీట్లు బలహీనంగా ఉన్న ఇతర యూరోప్ బ్యాంకుల షేర్లు కూడా కుదేలయ్యాయి. డాయిష్ షేరు ఏడాది కాలంగా 30 డాలర్లకు పైన ట్రేడ్ అవుతుండగా, తాజా పరిస్థితుల నడుమ సెప్టెంబర్ చివరికి అది 12 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఊహించని పరిణామం అయితే, ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం కూడా తాజా అనిశ్చితికి కారణంగా పేర్కొనవచ్చు. కేవలం 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లించాల్సి రావచ్చని మొదటి నుంచీ డాయిష్ భావిస్తోంది. అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని డాయిష్ బ్యాంక్ ప్రకటించింది. డాయిష్ బ్యాంకు ముందున్న మార్గం? అమెరికా న్యాయ శాఖ 14 బిలియన్ డాలర్లు డిమాండ్ చేయగా, ఇంత భారీ మొత్తంలో చెల్లించే ఉద్దేశం డాయిష్ బ్యాంకుకు ఏ కోశానా లేదు. దీనిపై తాము కౌంటర్ ప్రతిపాదన సమర్పించాల్సి ఉందని, చర్చలు ప్రారంభం అయ్యాయని డాయిష్ ఇప్పటికే తెలిపింది. ప్రత్యర్థి బ్యాంకులు ఇటువంటి కేసుల్లో అంతిమంగా తక్కువ జరిమానాకే పరిష్కరించుకున్నట్టే తాము కూడా దీనికి సానుకూల పరిష్కారం కనుగొంటామని డాయిష్ బ్యాంకు ఆత్మవిశ్వాసంతో ఉంది. 2 నుంచి 3 బిలియన్ డాలర్ల మధ్య జరిమానా చెల్లించడం అన్నది సహేతుకంగా ఉంటుందని డాయిష్ బ్యాంకు న్యాయ నిపుణుల సలహాగా ఉంది. చివరికి ఈ జరిమానా సగానికి తగ్గే అవకాశం ఉంటుందని అమెరికా న్యాయ నిపుణులు కూడా పేర్కొంటున్నారు. ముందే సిద్ధమైందా? అయితే ఈ వివాద పరిష్కారం కోసం డాయిష్ జూన్ చివరి నాటికే 6.2 బిలియన్ డాలర్లను రిజర్వ్‌లో ఉంచిందని సమాచారం. ఈ ఏడాది చివరికి ఈ రిజర్వ్ నిధులను పెంచే ఆలోచనలోనూ ఉంది. కనుక ఈ అంశంపై అంతగా ఆందోళన అవసరం లేదన్నది నిపుణుల యోచన. నిపుణులు ఏమంటున్నారు.. ‘డాయిష్ బ్యాంకు సమస్యలు పరిష్కారం అవుతాయనే నేను భావిస్తున్నాను. లెహమాన్ వలే డాయిష్ మారబోదు’ అన్నది హార్వర్డ్ లా స్కూల్ ప్రొఫెసర్ హాల్ ఎస్ స్కాట్ అభిప్రాయం. ఇదో అప్రమత్తత సూచనా? అన్న ప్రశ్నకు కూడా ఆయన కాదనే జవాబిచ్చారు. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు డాయిష్ తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించడం లేదా ఆస్తులను అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా న్యాయ శాఖ జరిమానాను సగానికి తగ్గించినా సరే అది జర్మనీకి చెందిన ఒకానొక అతిపెద్ద బ్యాంకుకు భారమేనన్నది నిపుణుల అభిప్రాయం. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్గాంగ్ సైతం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ బ్యాంకులు సైతం... డాయిష్ వలే ఇదే మాదిరి దర్యాప్తు ఎదుర్కొంటున్న యూరోప్ బ్యాంకుల్లో బార్క్లేస్, క్రెడిట్ సూసే గ్రూపు, యూబీఎస్గ్రూపు, రాయల్ బ్యాంక్ స్కాట్లాండ్ గ్రూపు ఉన్నాయి. భారీ జరిమానా చెల్లించిన కేసులు.. ⇔ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన కేసుల్లో అమెరికాకు చెందిన బడా బ్యాంకులు సైతం లోగడ బిలియన్ డాలర్ల జరిమానాలు చెల్లించాయి. ⇔ బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్ 16.65 బిలియన్ డాలర్లు ⇔ గోల్డ్‌మ్యాన్ శాక్స్ గ్రూపు 5.4 బిలియన్ డాలర్లు ⇔ సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీ మూడూ కలిపి 23 బిలియన్ డాలర్లు -
డాయిష్ బ్యాంక్‌కు అమెరికా భారీ జరిమానా
14 బిలియన్ డాలర్ల డిమాండ్... ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ దిగ్గజం డాయిష్ బ్యాంక్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసే పెద్ద చిక్కు వచ్చి పడింది. వివరాల్లోకి వెళితే... 2008కి ముందు రెసిడెంట్ తనఖా ఆధారిత బాండ్లను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించడం ద్వారా ఆర్థిక సంక్షోభానికి తన వంతు కారణమయ్యిందన్న అంశంపై అమెరికా న్యాయశాఖ డాయిష్ బ్యాంకు నుంచి 14 బిలియన్ డాలర్లను తాజాగా డిమాండ్ చేసింది. నిజానికి గత కొంత కాలంలో ఈ అంశానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ - బ్యాంక్ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో జరిమానా పడుతుందని డాయిష్ ఊహించకపోవడం తాజా బ్యాంక్ సంక్షోభానికి కారణమయ్యింది. కేవలం 3.4 బిలియన్ డాలర్ల మేర మాత్రమే డిమాండ్ ఉంటుందని మొదటి నుంచీ డాయిష్ భావిస్తూ వచ్చింది. అయితే ఈ అంశంపై పోరాటం కొనసాగిస్తామని, ఆందోళన అక్కర్లేదని డాయిష్ బ్యాంక్ ప్రకటించింది. షేర్ డౌన్...: తాజా పరిణామం బ్యాంక్ షేర్ ధరపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పటికే ఈ ఏడాది దాదాపు సగం నష్టపోయిన డాయిష్ బ్యాంక్ షేర్ తాజాగా శుక్రవారం 7.6. శాతం పడిపోయింది. తాజా సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశలో తన క్యాపిటల్ రేషియో బ్యాలెన్సింగ్ కోసం బ్యాంక్ ఇన్వెస్టర్ల నుంచి మరింత నిధులు సేకరించాల్సి రావచ్చనీ లేదా ఆస్తులూ అమ్మాల్సి రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అమెరికా న్యాయశాఖ తన డిమాండ్‌ను సగానికి తగ్గించినా... ఇది దాదాపు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్న బ్యాంకుకు భారంగానే ఉంటుందన్నది నిపుణుల ఉద్దేశం. ఈ సమస్య జర్మనీకి కూడా ఇబ్బందిగా పరిణమించింది. పరస్పర చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని జర్మనీ ఆర్థిక మంత్రి వోల్ప్గాంగ్ వ్యక్తం చేశారు. -
వృద్ధి అంచనా తగ్గించిన డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను డాయిష్ బ్యాంక్ తగ్గించింది. ఇంతక్రితం అంచనాలు 7.6 శాతంకాగా దీనిని 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- డాయిష్ బ్యాంక్ పేర్కొంది. బ్రెగ్జిట్సహా అంతర్జాతీయ ఆర్థిక అని శ్చితి పరిస్థితులు, పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం, నాన్-ఆయిల్, నాన్-గోల్డ్ దిగుమతులు బలహీనంగా ఉండడం వంటి అంశాలను ఈ సందర్భంగా డాయిష్ బ్యాంక్ ప్రస్తావించింది. జనవరి-మర్చి త్రైమాసికంలో వృద్ధి 7.9% నమోదుకాగా, ఇది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యథాతథంగాకానీ, కొంత దిగువకుగానీ పడిపోవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఇక ఇదే కాలంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయనీ వివరించింది. -
ఏప్రిల్ 5న పావుశాతం రేటు కోత: డాయిష్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల 5వ తేదీ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా పావుశాతం మాత్రమే రేటు కోత నిర్ణయం తీసుకుంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం డాయిష్ బ్యాంక్ అంచనావేసింది. అంతకుమించి రేటు కోతకు ఆర్బీఐ ముందు ద్రవ్యోల్బణం పరమైన అడ్డంకులు ఉంటాయని విశ్లేషించింది. వాస్తవ వడ్డీరేటు 1.5 శాతం నుంచి 2 శాతం శ్రేణిలో ఉండాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు కనబడుతోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. 2016-17లో ద్రవ్యోల్బణం 5 శాతంగా అంచనా వేస్తే... 6.50 శాతం లోపునకు రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) తగ్గించే అవకాశాలు ఆర్బీఐ ముందు అతి తక్కువగా ఉంటాయని విశ్లేషించింది. ఒకవేళ 50 బేసిస్ పాయింట్లను ఏప్రిల్5న తగ్గిస్తే... ఆపై రేటు కోత ఉండబోదని ఆర్బీఐ స్పష్టమైన సంకేతం ఇచ్చే అవకాశం ఉందని వివరించింది. -
సెన్సెక్స్ టార్గెట్ 30,000!
* ఏడాదిలో చేరే అవకాశం... * స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా.. * మోడీ-బీజేపీ అఖండ విజయంతో * ఇక సంస్కరణలకు జోష్ * అభివృద్ధిపైనే మోడీ పూర్తిగా దృష్టిసారించే చాన్స్ * ఆర్థిక వ్యవసపై విశ్వాసం పెరుగుతోందని వెల్లడి న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ తాజా ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం దేశ ఆర్థిక వ్యవస్థకు దివ్వ ఔషధంగా పనికొస్తుందా? అవుననే అంటున్నారు నిపుణులు. ఎన్డీఏ కూటమి సాధారణ మెజారిటీ కంటే భారీగా సీట్లను కైవసం చేసుకోవడం... బీజేపీ ఒక్కటే సొంతంగా మేజిక్ ఫిగర్ 272 సీట్లను అధిగమించడంతో ఇక ఆర్థిక సంస్కరణలు కొంత పుంతలు తొక్కుతాయనే అంచనాలు సర్వత్రా బలపడుతున్నాయి. ఈ ప్రభావంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రోజుకో కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలను తాకుతున్నాయి కూడా. అయితే, మోడీ నేతృత్వంలోని సుస్థిర సర్కారు తీసుకోబోయే సాహసోపేత పాలసీ చర్యలతో మార్కెట్లు మరింత పరుగు తీస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం. సంస్కరణలకు గనుక చేయూత లభిస్తే... సెన్సెక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) చివరినాటికి అంటే వచ్చే ఏడాది మార్చికల్లా 30,000 పాయిం ట్లను తాకొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పెరుగుతుంది... ప్రస్తుతం సెన్సెక్స్ గత రికార్డులన్నీ చెరిపేసి 24,500 స్థాయిలో కదలాడుతోంది. మోడీ విజయం రోజున ఏకంగా 25,000 పాయింట్లనూ అధిగమించింది. అయితే, చరిత్రాత్మక గరిష్టాల వద్దే సెన్సెక్స్ ఇప్పుడు ఉన్నప్పటికీ... మరింత దూసుకెళ్లేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని యాంబిట్ క్యాపిటల్ అభిప్రాయపడింది. మార్చినాటికి తమ సెన్సెక్స్ లక్ష్యాన్ని 30,000 పాయింట్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది జనవరిలో ఈ లక్ష్యం 24,000 పాయింట్లుగా ఉంది. గత దశాబ్దపు కాలానికి పైగా సంకీర్ణ ప్రభుత్వాల పాలన కారణంగా ఆర్థిక, విధానపరమైన నిర్ణయాల్లో జడత్వం నెలకొందని.. ఇప్పుడు మోడీ నేతృత్వంలో 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా బీజేపీ సొంతంగా సంపూర్ణ మెజారిటీ సాధించడంతో పారిశ్రామిక రంగానికి సానుకూల పరిస్థితులు నెలకొంటాయన్న విశ్వాసాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లోని మోడీ సర్కారు విజయాలు.. తాజా ఎన్నికల ప్రచారంలో అభివృద్ధిపైనే మోడీ దృష్టిసారించడం కూడా ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతోందంటున్నారు. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది... విదేశీ సంస్థ డాయిష్ బ్యాంక్ కూడా ఈ ఏడాది డిసెంబర్‌నాటికి సెన్సెక్స్ 28,000 పాయింట్లకు, నిఫ్టీ 8,000 పాయింట్లకు ఎగబాకవచ్చని అంచనా వేసింది. ‘దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. పెట్టుబడులకు భారత్ మెరుగైన గమ్యంగా భావిస్తున్నారు. దీంతో మరిన్ని నిధులు ఇక్కడకు తరలనున్నాయి’ అని డీబీఎస్ బ్యాంక్ హెడ్(ట్రెజరీ-మార్కెట్స్) విజయన్ ఎస్ పేర్కొన్నారు. ఇక మోర్గాన్ స్టాన్లీ కూడా తన తాజా రీసెర్చ్ నోట్లో మార్కెట్లు మరింత దూకుడును కనబరుస్తాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది జూన్‌నాటికి సెన్సెక్స్ టార్గెట్‌ను 26,300 పాయింట్లకు పెంచింది. గతంలో ఈ టార్గెట్ 21,280 పాయింట్లుగా ఉంది. ‘మోడీ సాధించిన భారీ విజయం, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై దృష్టిపెడుతూ ఆయన సాగించిన ప్రచారంతో సంస్కరణలు, ప్రస్తుత పాలసీ చర్యలు మరింత ముందుకెళ్తాయన్న నమ్మకం పెరుగుతోంది. భారత్ ఈక్విటీ మార్కెట్‌పై మా బులిష్ ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడప్పుడే లాభాలను స్వీకరించడం తొందరపాటే’ అని యూబీఎస్ తన నివేదికలో పేర్కొంది. సంస్కరణలు, సరైన ఆర్థిక మంత్రే కీలకం: డీబీఎస్ ముంబై: మోడీ ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణల ఎజెండా... ఆర్థిక మంత్రి ఎంపిక, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను కొనసాగించడం... ఈ అంశాలే మార్కెట్ సెంటిమెంట్‌ను ముందుకు నడిపిస్తాయని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజి దిగ్గజం డీబీఎస్ అభిప్రాయపడింది. గతేడాది జపాన్‌లో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పుడు అక్కడి మార్కెట్లు దూసుకెళ్లిన అంశానికీ... ఇప్పుడు మోడీ భారీ విజయంతో భారత్ మార్కెట్లలో దూకుడుకు ఎలాంటి పోలికలూ లేవని కూడా డీబీఎస్ పేర్కొంది. తక్షణం మార్కెట్ల సెంటిమెంట్‌కు బూస్ట్ ఇచ్చేది సరైన ఆర్థిక మంత్రి నియామకమేనని, రాజన్‌ను కొనసాగించడం కూడా రూపాయి విలువకు మద్దతుగా నిలుస్తుందని తన రీసెర్చ్ నివేదికలో వెల్లడించింది. -
పెట్టుబడులకు పునరుత్తేజం కావాలి..
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు పారిశ్రామిక రంగానికి మరింత చేదోడుగా నిలవాలని కార్పొరేట్లు కోరుతున్నారు. సోమవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ బిర్లా మాట్లాడుతూ... పాత ఒప్పందాలకూ వర్తించేలా తీసుకొచ్చిన పన్ను చట్టాల సవరణ, ఇతరత్రా మల్టీబ్రాండ్ రిటైల్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రావాలన్నదే తమ అభిప్రాయమని కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ ప్రతిపాదనలకు బీజేపీ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై మీ వైఖరేంటన్న ప్రశ్నకు బిర్లా ఈ విధంగా స్పందించారు. కాగా, కొత్త ప్రభుత్వానికి ఫిక్కీ సూచించిన అజెండాలో ఇంకా... 2015కల్లా వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) అమలు, జాతీయ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు, సబ్సిడీలపై సమీక్ష, ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు, డీటీసీ)లో మార్పుచేర్పులు వంటి పలు అంశాలు ఉన్నాయి. సీఐఐదీ ఇదే మాట... పెట్టుబడులకు ప్రోత్సాహంతోపాటు ఎగుమతులకు చేయూత, ఆర్థిక స్థిరీకరణ, వ్యాపారానికి సానుకూల పరిస్థితులు, పొదుపు పెంచేలా చర్యలు, వృద్ధికి ఆసరా, ధరలకు కళ్లెం వేయడం వంటి అంశాలపై మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు దృష్టిపెట్టాలని భారతీయ పరిశ్రమ సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ఈ మేరకు సీఐఐ అధ్యక్షుడు అజయ్ శ్రీరామ్ ఒక అజెండా విడుదల చేశారు. ముందుగా 6.5% జీడీపీ వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకోవాలని.. 2016-17లో దీన్ని 8.5 శాతానికి పెంచడానికి కృషిచేయాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలతో సమన్వయంతో కేంద్రం- పారిశ్రామిక వృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి పెట్టాలన్నారు. -
ఐపీవోకి చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా
హాంకాంగ్: చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాల్లో ఉంది. ఇందుకు వీలుగా ఆరు మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు నిర్వహిస్తోంది. అమెరికా మార్కెట్లలో చేపట్టనున్న ఐపీవో ద్వారా కంపెనీ 15 బిలియన్ డాలర్ల వరకూ సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే 2012లో వచ్చిన ఫేస్బుక్ ఇష్యూ తరువాత అతిపెద్ద ఐపీవోగా నిలిచే అవకాశముంది. ఇష్యూ నిర్వహించేందుకు(అండర్‌రైటింగ్) సిటీగ్రూప్, డాయిష్ బ్యాంక్, గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ తదితర సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ ఇష్యూ ఊహించినదానికంటే అధిక విలువను సాధించే అవకాశమున్నదని, తద్వారా టెక్నాలజీ పరిశ్రమలో రెండో అతిపెద్ద ఇష్యూగా నిలవవచ్చునని పేర్కొన్నాయి. ఈబే, అమెజాన్ కలిపితే... ఈ కామర్స్ దిగ్గజాలు ఈబే, అమెజాన్.కామ్ల సంయుక్త బిజినెస్‌కంటే అలీబాబా వ్యాపారమే అధికంకావడం విశేషం. సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది పనిచేస్తున్నారు. చైనా ఈ కామర్స్ మార్కెట్లో 80% వాటా కంపెనీదే. అలీబాబాలో 37% వాటాతో సాఫ్ట్‌బ్యాంక్, 24% వాటా కలిగిన యాహూ అతిపెద్ద వాటాదారులుగా ఉన్నాయి. అలీబాబా వ్యవస్థాపకులు, కొంతమంది సీనియర్ మేనేజర్లకు కలిపి 13% వరకూ వాటా ఉంది. -
క్యూ2 వృద్ధికి వర్షాల ఊతం
న్యూఢిల్లీ: మెరుగైన వర్షపాతం, పారిశ్రామికోత్పత్తి, వినియోగ వ్యయాలు పెరగడం తదితర సానుకూల అంశాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి మెరుగుపడొచ్చని డాయిష్ బ్యాంక్, డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ (డీఅండ్‌బీ) సంస్థలు వేర్వేరు నివేదికల్లో అంచనా వేశాయి. క్యూ2లో వృద్ధి 5.5 శాతంగా ఉండొచ్చని డాయిష్ బ్యాంక్ లెక్కగట్టగా, ఇది 4.5 శాతం మేర ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ముందుగా పెద్ద ఆశావహమైన అంచనాలు లేకపోయినప్పటికీ.. పలు సానుకూల అంశాల వల్ల క్యూ2లో ఏడాది కాలంలోనే అత్యుత్తమ వృద్ధి నమోదు కాగలదని భావిస్తున్నట్లు డాయిష్ బ్యాంక్ వివరించింది. పారిశ్రామికోత్పత్తి క్షీణించడం, సేవా రంగం మందగించడం కారణాలతో.. తొలి త్రైమాసికంలో ఎకానమీ వృద్ధి కేవలం 4.4 శాతానికే పరిమితం అయింది. గత 17 త్రైమాసికాల్లో ఇది కనిష్టం. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఏకంగా పదేళ్ల కనిష్టమైన 5 శాతానికి క్షీణించిన సంగతి తెలిసిందే. మెరుగుపడుతున్నా.. కొంత బలహీనం పారిశ్రామికోత్పత్తి ధోరణిని బట్టి చూస్తే.. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక రంగం కాస్త పుంజుకున్నట్లు కనిపిస్తోందని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. క్యూ2లో పారిశ్రామిక రంగ వృద్ధి 1.8 శాతంగా ఉండొచ్చని తెలిపింది. క్రితం త్రైమాసికంలో ఇది 0.9 శాతంగా ఉంది. ఇక మొత్తం సర్వీసుల రంగం రెండో త్రైమాసికంలో 7 శాతం మేర వృద్ధి చెందవచ్చని డాయిష్ బ్యాంక్ పేర్కొంది. క్రితం త్రైమాసికంలో ఇది 6.2 శాతంగా నమోదైంది. ఇక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ద్రవ్య లోటు తగ్గొచ్చని డాయిష్ బ్యాంక్ వివరించింది. అటు, మిగతా త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి బలహీనంగానే ఉండొచ్చని డీఅండ్‌బీ పేర్కొంది. ఇప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతుండటం, ద్రవ్యలోటు అధికంగానే ఉండటం, తయారీ రంగం కోలుకోకపోవడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తాయని తెలిపింది. భారీ ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇవి ఫలితాలిచ్చేందుకు సమయం పడుతుందని డీఅండ్‌బీ ఇండి యా సీనియర్ ఎకానమిస్టు అరుణ్ సింగ్ చెప్పారు. ఇవి ఎంతమేరకు వ్యాపార వర్గాల్లో విశ్వాసం నింపగలవో కూడా చూడాల్సి ఉంటుందన్నారు. 62.60కు రుపీ... ఇక రూపాయి విషయానికొస్తే.. దేశీ కరెన్సీ మారకం విలువ నవంబర్‌లో 62.60-62.80 మధ్య తిరుగాడవచ్చని డీఅండ్‌బీ అంచనా వేసింది. సమీప భవిష్యత్‌లో ఇది 65కి క్షీణించినా మొత్తం మీద ఈఏడాది ఆఖరు నాటికి 63 స్థాయిలో నిలవొచ్చని డాయిష్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 62.87 వద్ద ఉంది. -
డిసెంబర్ నాటికి 22వేలకు సెన్సెక్స్: డాయిష్ బ్యాంక్
ముంబై: మెరుగైన వర్షపాతం వంటి సానుకూల పరిణామాలతో ఇన్వెస్టర్లలో నిరాశావాదం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో సెన్సెక్స్ ఈ డిసెంబర్ నాటికి 22,000 పాయింట్ల రికార్డు స్థాయికి పెరగగలదని జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది. గతంలో తాము ప్రకటించిన 21,000 పాయింట్ల లక్ష్యాన్ని సవరించి 22,000కి పెంచుతున్నట్లు తెలిపింది. 2008 జనవరి ఒకటిన 21,206.77 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మళ్లీ.. గురువారం ఇంట్రాడేలో 21,039 పాయింట్ల స్థాయిని తాకింది. 2008లో సెన్సెక్స్ తన పీఈ నిష్పత్తికి 28.12 రెట్లు ట్రేడ్ కాగా.. గురువారం 18.89 రెట్లు ట్రేడ్ అయ్యింది. కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుండడం, ఎగుమతుల పెరుగుదల ధోరణి వంటి అంశాలను ఈ సందర్భంగా బ్యాంక్ ప్రస్తావించింది. మరోవైపు, పెట్టుబడులకు అనుకూలమైన రంగాల జాబితాలో ఐటీ సర్వీసులను తప్పించి బ్యాంకులను చేర్చింది. ఐటీ సేవలకు న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్ వంటి సంస్థలు మెరుగైన పనితీరు కనబర్చగలవని డాయిష్ బ్యాంక్ అంచనా వేసింది.