‘డాయిష్’ మరో లెహమాన్ బ్రదర్స్ కానుందా? | Deutsche Bank AG (USA)(NYSE:DB): No DoJ Deal | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 12 2016 3:28 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక రంగం ఇంకా కోలుకునే ప్రయత్నాల్లోనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో డాయిష్ బ్యాంకు 14 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలంటూ అమెరికా న్యాయశాఖ చేసిన డిమాండ్‌తో ఇటీవల ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యాయి. 2008లో అమెరికాకు చెందిన ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం లెహమాన్ బ్రదర్స్ కుప్పకూలడమే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.619 బిలియన్ డాలర్ల రుణాలతో లెహమాన్ దివాళా పిటిషన్ దాఖలు చేసింది. తాజా పరిణామాలను చూస్తే జర్మనీకి చెందిన నాలుగో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం డాయిష్ కూడా లెహమాన్ బ్రదర్స్ మాదిరిగా చేతులెత్తేస్తుందేమో?, మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని చవిచూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలు బయల్దేరాయి. మరి ఈ అంశం చివరికి ఎటు దారి తీస్తుంది...? ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement