జర్మనీలో అతిపెద్ద లెండర్ 'డ్యుయిష్ బ్యాంక్' తాజాగా 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు భారీగా తగ్గిపోవడం వల్ల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2022 కంటే కూడా 2023లో సంస్థ లాభాలు 16 శాతం తగ్గడం మాత్రమే కాకుండా, ఖర్చులు పెరగడం వల్ల డ్యుయిష్ బ్యాంక్ 3500 మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది.
ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆదాయం సంవత్సరానికి ఆరు శాతం పెరిగి 28.9 బిలియన్ యూరోలకు చేరుకుందని, అనిశ్చితి వాతావరణంలో కూడా బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'క్రిస్టియన్ సివింగ్' ప్రశంసించారు. కానీ బ్యాంక్ మరింత లాభాలను పొందే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని వెల్లడించారు.
ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు!
2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్యుయిష్ బ్యాంక్ 85000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లేఆప్స్ చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment