
వృద్ధి అంచనా తగ్గించిన డాయిష్ బ్యాంక్
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను డాయిష్ బ్యాంక్ తగ్గించింది. ఇంతక్రితం అంచనాలు 7.6 శాతంకాగా దీనిని 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- డాయిష్ బ్యాంక్ పేర్కొంది. బ్రెగ్జిట్‌సహా అంతర్జాతీయ ఆర్థిక అని శ్చితి పరిస్థితులు, పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం, నాన్-ఆయిల్, నాన్-గోల్డ్ దిగుమతులు బలహీనంగా ఉండడం వంటి అంశాలను ఈ సందర్భంగా డాయిష్ బ్యాంక్ ప్రస్తావించింది. జనవరి-మర్చి త్రైమాసికంలో వృద్ధి 7.9% నమోదుకాగా, ఇది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యథాతథంగాకానీ, కొంత దిగువకుగానీ పడిపోవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఇక ఇదే కాలంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయనీ వివరించింది.