అమెరికా వృద్ధి పటిష్టత
క్యూ2లో 3.7 శాతం అప్
వాషింగ్టన్: అమెరికా వృద్ధి పటిష్టంగా మారుతోందనటానికి తాజా స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు అద్దం పడుతున్నాయి. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) వృద్ధి 3.7 శాతంగా నమోదయింది. ఇది తొలి అంచనాలకన్నా (2.3 శాతం) అధికం కావడం దేశ ఆర్థిక వేత్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. వ్యక్తిగత వినియోగ విభాగంలో పెరుగుదలే ఈ వృద్ధికి కారణమని ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశం తొలి త్రైమాసికంలో 0.6 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదే వడ్డీరేటు 0.25 శాతం స్థాయి నుంచి పెంచే అవకాశం ఉందని కొన్ని వర్గాల అభిప్రాయం.