20 వేల దిశగా పుత్తడి! | if US Federal Reserve interest rates increase,falls of gold rates | Sakshi
Sakshi News home page

20 వేల దిశగా పుత్తడి!

Published Sat, Jun 6 2015 12:27 AM | Last Updated on Fri, Aug 24 2018 4:48 PM

20 వేల దిశగా పుత్తడి! - Sakshi

20 వేల దిశగా పుత్తడి!

అమెరికా ఫెడరల్ రిజర్వ్ గానీ అక్కడి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభిస్తే...

ఈ ఆర్థిక సంవత్సరంలో తగ్గనున్న రేట్లు
ఇండియా రేటింగ్స్ అంచనా
ముంబై:
అమెరికా ఫెడరల్ రిజర్వ్ గానీ అక్కడి వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో (2015-16) బంగారం రేట్లు భారీగా క్షీణించవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) అంచనా వేసింది. దీని వల్ల అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) పసిడి ధర 900-1,050 డాలర్లకు పడిపోవచ్చని పేర్కొంది. దీంతో దేశీయంగా పది గ్రాముల బంగారం రేటు రూ. 20,500- రూ. 24,000 స్థాయికి దిగి రావొచ్చని ఇండ్-రా తెలిపింది. ప్రస్తుతం పసిడి ధర రూ. 27,000 స్థాయిలో ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించిన దానికంటే ఎక్కువగా పెంచిన పక్షంలో బంగారం ధర 10-25 శాతం క్షీణించవచ్చని వివరించింది. అయితే, పెంపు విషయంలో జాప్యం చేసిన పక్షంలో అంతర్జాతీయంగా పుత్తడి రేటు ఇంకా పెరిగి ఔన్సుకు 1,300-1,350 డాలర్ల శ్రేణిలో ఉండగలదని ఇండ్-రా తెలిపింది. దీనికి తగ్గట్లుగా దేశీయంగా కూడా రేటు ప్రస్తుత స్థాయి నుంచి పెరిగి రూ. 29,500-30,500 శ్రేణిలో ఉండగలవని పేర్కొంది. డాలర్ మినహా ఇతర ప్రధాన కరెన్సీలు బలహీనపడినా కూడా ఇటు బంగార ం ధర, అటు డాలర్ విలువ మధ్యమధ్యలో బలపడుతూ ఉండే అవకాశాలున్నాయని ఇండ్-రా తెలిపింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా అత్యధికం శాతం మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని ఎంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇండ్-రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement