జైట్లీతో రాజన్ భేటీ | RBI Governor Rajan meets FM Jaitley ahead of monetary policy | Sakshi
Sakshi News home page

జైట్లీతో రాజన్ భేటీ

Published Sat, Nov 28 2015 12:49 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

జైట్లీతో రాజన్ భేటీ - Sakshi

జైట్లీతో రాజన్ భేటీ

డిసెంబర్ 1 పాలసీ సమీక్ష నేపథ్యం...
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయంపై ప్రధాన చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.  

చర్చల అనంతరం రాజన్ మాట్లాడుతూ, ‘చర్చలు ఎప్పుడూ చక్కగా, సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి’ అని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతానికి చేరడం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో... డిసెంబర్ 1వ తేదీన ఆర్‌బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

అలాగే ఇప్పటికే తగ్గించిన రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా తగిన స్థాయిలో కస్టమర్లకు బదలాయించలేదన్న అభిప్రాయమూ ఉంది.  ఆర్‌బీఐ నుంచి తాము తీసుకునే స్వల్పకాలిక రుణంపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు రెపో ప్రస్తుతం నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 6.75 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
 
ఫిబ్రవరిలో రేటు కోత: బీఓఎఫ్‌ఏ
మంగళవారం ఆర్‌బీఐ రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, అయితే ఫిబ్రవరిలో జరిగే సమీక్ష సందర్భంగా పావుశాతం తగ్గించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement