బంగారం ధరలో స్వల్ప వృద్ధి
సీజనల్ డిమాండ్ కారణంగా బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఊపందుకోవడం వల్ల గతవారం బంగారం ధర మళ్లీ స్పల్పంగా పెరిగాయి. అమెరికా నిరుద్యోగిత ఏడేళ్ల కనిష్ట స్థాయికి చేరడం, అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచుతుందనే ఊహాగానాలు కూడా బంగారం ధర పెరుగుదలకు కార ణాలుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 1,115 డాలర్లుగా ఉంది. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.70 పెరిగి రూ.26,545గా, అలాగే 99.5 స్వచ్ఛత గల బంగారం ధర కూడా అదే మొత్తంలో పెరిగి రూ.26,395గా ఉంది.