Akshaya Tritiya: Gold and Silver Prices on April 23 - Sakshi
Sakshi News home page

Gold rates: అక్షయ తృతీయ వేళ కరుణించిన బంగారం! తగ్గిన ధర..

Published Sun, Apr 23 2023 12:34 PM | Last Updated on Sun, Apr 23 2023 12:56 PM

Gold and silver prices on April 23 Akshaya Tritiya  - Sakshi

అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం కాస్త కరుణించింది. ఆదివారం (ఏప్రిల్‌ 23) 22 క్యారెట్లు,  24 క్యారెట్ల బంగారం రెండు ధరలూ  మునపటి రోజు కంటే ధర కొంతమేర తగ్గి పండుగ వేళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. 

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం (ఏప్రిల్‌ 23) రూ.30 తగ్గి రూ.5,575 వద్ద ఉంది. శనివారం (ఏప్రిల్‌ 23) ఇది రూ. 5,605 ఉండేది. అదేవిధంగా 8 గ్రాముల ధర రూ.44,600, తులం (10 గ్రాములు) ధర రూ.55,750లుగా ఉంది. అంటే తులానికి రూ.300 చొప్పున ధర తగ్గింది.

ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...

ఇక 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.33 చొప్పున తగ్గింది. ప్రస్తుతం రూ. 6,082 వద్ద ఉంది. అంత​కుముందు రోజు దీని ధర రూ.6,115 ఉండేది. 8 గ్రాముల ధర రూ. 48,656లు ఉండగా 10 గ్రాములు (తులం) ధర రూ.60,820. మొత్తంగా తులంపై రూ.330 తగ్గింది.  

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా..
ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా    నగరాల్లో ఒక తులం(10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900, 24 క్యారెట్ల పసిడి ధర    రూ. 60,970. అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, వడోదరలలో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,800 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870లుగా ఉంది. ఇక చెన్నై, కోయంబత్తూరు, మధురై నగరాల్లో 22 క్యారెట్ల పుత్తడి ధర  రూ. 56,050 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,150 ఉంది. అలాగే హైదరాబాద్, పుణే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.55,750లుగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820లుగా ఉంది.

ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! 

మరోవైపు బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ఆదివారం (ఏప్రిల్ 23) తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. గ్రాము వెండి ధర రూ.0.70 తగ్గి రూ. 76.90లకు చేరింది. అంటే 8 గ్రాములకు రూ. 5.60, 10 గ్రాములకు రూ. 7 తగ్గింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ.769. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో గ్రాము వెండి రూ.760, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో రూ. 804 వద్ద ఉంది.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement