మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే.. | Today Gold And Silver Prices November 26th, 2024 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

Published Tue, Nov 26 2024 11:23 AM | Last Updated on Tue, Nov 26 2024 11:40 AM

gold and silver rates today on market in telugu states

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సెషన్‌ల నుంచి ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుతున్నాయి. ఇప్పటివరకు కొంత సేఫ్డ్‌ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు మంగళవారం యూటర్న్‌ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,800 (22 క్యారెట్స్), రూ.77,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1200, రూ.1310 తగ్గింది.

చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1310 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.

దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1200 తగ్గి రూ.70,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1310 దిగజారి రూ.77,390 వద్దకు చేరింది.

సిల్వర్ ధరలు

బంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement