Silver Price decrease
-
మళ్లీ అవకాశం రాదేమో! తగ్గిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సెషన్ల నుంచి ఈక్విటీ మార్కెట్లు భారీగా పెరుతున్నాయి. ఇప్పటివరకు కొంత సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,800 (22 క్యారెట్స్), రూ.77,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1200, రూ.1310 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1310 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,240 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1200 తగ్గి రూ.70,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1310 దిగజారి రూ.77,390 వద్దకు చేరింది.సిల్వర్ ధరలుబంగారం ధరలు తగ్గడంతో పాటు వెండి ధర కూడా ఈ రోజు భారీగానే పడిపోయింది. సోమవారంతో పోలిస్తే కేజీ వెండి రేటు రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అక్షయ తృతీయ వేళ కరుణించిన బంగారం!
అక్షయ తృతీయ పండుగ వేళ బంగారం కాస్త కరుణించింది. ఆదివారం (ఏప్రిల్ 23) 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం రెండు ధరలూ మునపటి రోజు కంటే ధర కొంతమేర తగ్గి పండుగ వేళ కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గుడ్‌రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఆదివారం (ఏప్రిల్ 23) రూ.30 తగ్గి రూ.5,575 వద్ద ఉంది. శనివారం (ఏప్రిల్ 23) ఇది రూ. 5,605 ఉండేది. అదేవిధంగా 8 గ్రాముల ధర రూ.44,600, తులం (10 గ్రాములు) ధర రూ.55,750లుగా ఉంది. అంటే తులానికి రూ.300 చొప్పున ధర తగ్గింది. ఇదీ చదవండి: Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి... ఇక 24 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.33 చొప్పున తగ్గింది. ప్రస్తుతం రూ. 6,082 వద్ద ఉంది. అంతకుముందు రోజు దీని ధర రూ.6,115 ఉండేది. 8 గ్రాముల ధర రూ. 48,656లు ఉండగా 10 గ్రాములు (తులం) ధర రూ.60,820. మొత్తంగా తులంపై రూ.330 తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా.. ఢిల్లీ, జైపూర్, లక్నో, నోయిడా నగరాల్లో ఒక తులం(10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,970. అహ్మదాబాద్, బెంగళూరు, సూరత్, వడోదరలలో 22 క్యారెట్ల స్వర్ణం రూ. 55,800 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870లుగా ఉంది. ఇక చెన్నై, కోయంబత్తూరు, మధురై నగరాల్లో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 56,050 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,150 ఉంది. అలాగే హైదరాబాద్, పుణే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.55,750లుగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,820లుగా ఉంది. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! మరోవైపు బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ఆదివారం (ఏప్రిల్ 23) తగ్గాయి. గుడ్‌రిటర్న్స్ ప్రకారం.. గ్రాము వెండి ధర రూ.0.70 తగ్గి రూ. 76.90లకు చేరింది. అంటే 8 గ్రాములకు రూ. 5.60, 10 గ్రాములకు రూ. 7 తగ్గింది. ప్రస్తుతం తులం వెండి ధర రూ.769. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో గ్రాము వెండి రూ.760, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో రూ. 804 వద్ద ఉంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
బలపడిన రూపాయి
ముంబై: రోజురోజుకు దిగజారిపోతున్న రూపాయి ఈరోజు బలపడింది. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రూపాయి బలపడటం ఆశాజనక పరిణామం. నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం కూడా ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92 పైసలు పడిపోయి 68.55 స్థాయికి చేరుకుంది. సాయంత్రానికి 66.82 రూపాయలకు బలపడింది. రూపాయి విలువ బలపడటంతో బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ధర ఎంసిఎక్స్(మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్)లో 10 గ్రాములు నిన్నటితో పోల్చితే 1084 రూపాయలు తగ్గి 33,355 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,778 రూపాయలు తగ్గి 54,530 రూపాయలకు చేరింది. మరోవైపు ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఘడించాయి. సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 18,567 పాయింట్లుగా, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 5,448 పాయింట్లుగా ఉంది.