బలపడిన రూపాయి
ముంబై: రోజురోజుకు దిగజారిపోతున్న రూపాయి ఈరోజు బలపడింది. రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రూపాయి బలపడటం ఆశాజనక పరిణామం. నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం కూడా ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 92 పైసలు పడిపోయి 68.55 స్థాయికి చేరుకుంది. సాయంత్రానికి 66.82 రూపాయలకు బలపడింది.
రూపాయి విలువ బలపడటంతో బంగారం ధర భారీగా తగ్గింది. బంగారం ధర ఎంసిఎక్స్(మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్)లో 10 గ్రాములు నిన్నటితో పోల్చితే 1084 రూపాయలు తగ్గి 33,355 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర 2,778 రూపాయలు తగ్గి 54,530 రూపాయలకు చేరింది.
మరోవైపు ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఘడించాయి. సెన్సెక్స్ 333 పాయింట్ల లాభంతో 18,567 పాయింట్లుగా, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 5,448 పాయింట్లుగా ఉంది.