త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఆనందం కలిగించే వార్త ఇది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ధరలు ఈరోజు (మే 1) ఏకంగా రూ.1260 మేర తగ్గాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నంలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,550 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ. 71,510 లకు తగ్గింది.
ఇతర నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.65,700 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.71,660 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 వద్దకు దిగొచ్చింది.
చెన్నైలో అయితే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.1150 తగ్గి రూ.71,510 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1260 తగ్గి రూ.72,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 క్షీణించి రూ.65,550 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1090 తగ్గి రూ.71,510 లకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment