సాక్షి, న్యూఢిల్లీ: అక్షయ తృతీయరోజు బంగారం ధరలు స్వల్పంగా వెనక్కి తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర 62 రూపాయలు క్షీణించి 31,321 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలతో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించినట్టు బులియన్ ట్రేడర్లు తెలిపారు. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని కనబరుస్తున్నాయి. అయితే అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మార్కెట్లో రీటైల్ కొనుగోళ్లతో నష్టాలు పరిమితంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
మల్టీ కామోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఏప్రిల్ కాంట్రాక్టులలో బంగారం ధర 62 రూపాయలు లేదా 0.20 శాతం నష్టంతో రూ .31,321 కి చేరుకుంది.అలాగే ఆగస్టు నెలలో డెలివరీ ధర రూ .56 లేదా 0.18 శాతం పడిపోయి పది గ్రాముల రూ .31,487 కు పడి పోయాయి.స్పాట్ మార్కెట్లలో, చె న్నైలో ఓపెనింగ్ ట్రేడ్లో పది గ్రాముల బంగారం ధర రూ .29,920 వద్ద ఉంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో పసిడి ధరలు ఇంకే తగ్గుముఖం పట్టనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ మార్కెట్లో బలహీనంగా ఉన్న ధోరణి ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అటు గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి 1,342.70 డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment