అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, దేశీయంగా జ్యుయలర్లు..రిటైలర్ల నుంచి డిమాండ్
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, దేశీయంగా జ్యుయలర్లు..రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం తదితర పరిణామాలతో పసిడి ధరలు గురువారం క్షీణించాయి. ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 35 తగ్గి రూ. 25,300 వద్ద, ఆభరణాల బంగారం కూడా అంతే తగ్గుదలతో రూ. 25,185 వద్ద ముగిసింది.
అంతర్జాతీయంగా డాలరు సూచీ ఏకంగా మూడు వారాల గరిష్టానికి ఎగియడంతో ఫ్యూచర్స్ మార్కెట్లో ఫిబ్రవరి కాంట్రాక్టుకు సంబంధించి ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 25.80 డాలర్లు క్షీణించి 1,051 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. దీనికి అనుగుణంగా దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంట్రాక్టు ఒక దశలో సుమారు రెండున్నర శాతం పైగా క్షీణించి రూ. 24,740 స్థాయిలో ట్రేడయ్యింది. అటు మార్చి కాంట్రాక్టుకు సంబంధించి కిలో వెండి ధర కూడా 4 శాతం పైగా క్షీణించి రూ. 33,030 దగ్గర ట్రేడయ్యింది. ఈ పతనం ఇలాగే కొనసాగితే శుక్రవారం బులియన్ స్పాట్ మార్కెట్‌లోనూ రేట్లు దిగజారే అవకాశం ఉంది.