సోనియాగాంధీకి యూఎస్ కోర్టు మందలింపు
1984 సిక్కుల ఊచకోతకు సంబంధించిన కేసులో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ జనవరి 2 తేదిలోగా స్పందించాలని యూఎస్ ఫెడరల్ కోర్టు సూచించింది.
1984 సిక్కుల ఊచకోతకు సంబంధించిన కేసులో యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ జనవరి 2 తేదిలోగా స్పందించాలని యూఎస్ ఫెడరల్ కోర్టు సూచించింది. ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన మారణకాండకు బాధ్యులైన వారికి అండగా నిలిచారని, ఆదుకున్నారని, పదవులు కట్టబెట్టారని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ ఎఫ్ జే) అనే సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు, పోలీసు అధికారులుకు ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు.
గత సెప్టెంబర్ మాసంలో చికిత్స కోసం న్యూయార్క్ లోని స్లోయాన్ కెట్టెరింగ్ హస్పిటల్ లో ఈ కేసుకు సంబంధించిన సమన్లు అందచేశారని ఎస్ ఎఫ్ జే తెలిపింది. అయితే తమకు ఎలాంటి సమన్లు అందలేదని సోనియా గాంధీ, ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. ఈ దుర్ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా ఎస్ ఎఫ్ జే తరపు న్యాయవాది గురుప్రిత్ సింగ్ పానున్ సోనియాగాంధీపై కేసు నమోదు చేశారు.