
మళ్లీ ఎవరూ ముందుకు రాలేదట..
ముంబై: పారిశ్రామిక వేత్త, రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యా గోవాలోని కింగ్ పిషర్ విల్లాను కొనుగోలు చేయడానికి మరోసారి ఎవరూ ముందుకు రాలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియమ్ కింగ్ ఫిషర్ విల్లా వేలం బుధవారం మరోసారి నిర్వహించాయి. కనీస ధరను రూ.85.29 కోట్లుగా నిర్ణయించిన ఈ వేలంలో ఎవరూ కొనుగోలుకు ముందుకు రావక పోవడం బ్యాంకుల బృందం ఇబ్బందులో పడ్డట్టయింది. దీంతో వేలం మరోసారి వాయిదా పడింది.
గోవాలోని విలాసవంతమైన ఈ భవనాన్ని విజయ్‌మాల్యా విందులు, వినోదాలు, స్పెషల్ పార్టీల కోసం ఉపయోగించేవాడు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9 వేల కోట్ల బకాయిల వివాదంలో విల్లాను బ్యాంకుల కన్సార్టియం గతేడాదే స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి పలుసార్లు నిర్వహించిన వేలం విఫలమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.