కింగ్ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15 శాతం తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు. ముంబైలోని విమానాశ్రయం సమపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది. కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు బ్యాంకులు ఇచ్చిన రూ.9,000 కోట్ల రుణాలు మొండి బకారుులుగా మారడం తెలిసిందే. ఉద్దేశపూర్వక ఎగవేతదారుడంటూ కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాను కొన్ని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించారుు. కింగ్‌ఫిషర్ భవనం వేలం ద్వారా కొంతైనా సమకూరుతుందని బ్యాంక్చు కన్సార్టియమ్ ఆశిస్తుండగా... గతంలో రెండు సార్లు వేలానికి ఉంచగా నిరాశే ఎదురైంది.
Published Sun, Nov 27 2016 7:44 AM | Last Updated on Thu, Mar 21 2024 9:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement