
మాల్యాపై చర్యలకు ఈడీ కసరత్తు
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విచారణకు హాజరు కాకపోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) యోచిస్తోంది. రూ.900 కోట్ల ఐడీబీఐ మనీ లాండరింగ్ కేసులో మూడు సార్లు సమన్లు పంపించినప్పటికీ, విజయ్ మాల్యా హాజరు కాకపోవడంతో తగిన చర్యలకు ఈడీ సిద్ధమవుతోంది. ఈ కేసులో విచారణను మరింత ముందుకు తీసుకుపోయేందుకు తగిన చర్యలు తీసుకోనున్నామని ఈడీ ఉన్నతాధికారొకరు చెప్పారు. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేయడం, విజయ్ మాల్యా ఇంటర్నేషనల్ ట్రావెల్ అధారిటీ డాక్యుమెంట్‌ను రద్దు చేయించడం తదితర చర్యల తీసుకోవాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.