ఆ రెండు కంపెనీల పన్ను బకాయిలు తెలిస్తే షాక్!
ఆ రెండు కంపెనీల పన్ను బకాయిలు తెలిస్తే షాక్!
Published Fri, Nov 25 2016 7:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
న్యూఢిల్లీ : దేశీయ ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్కు చెందిన టాటా మోటార్స్, లిక్కర్ కింగ్ విజయ్మాల్యా ప్రమోటెడ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఈ రెండు కంపెనీలే ఏకంగా రెండువేల కోట్లకు పైగా పన్ను బకాయిలను ఖజానాకు చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు పార్లమెంట్కు కేంద్రం తెలిపింది. పరోక్ష పన్నుల రూపంలో చెల్లించాల్సిన ఈ రెండు కంపెనీలు రూ.2158.81కోట్లను చెల్లించలేదని పేర్కొంది. టాటా మోటార్స్, 91 కేసుల్లో రూ.629.76 కోట్ల అవుట్స్టాండింగ్ ఎక్సైజ్ డ్యూటీని, 5 కేసుల్లో రూ.516.09 కోట్ల సర్వీసు ట్యాక్స్లను చెల్లించలేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు ఓ లిఖిత పూర్వక పత్రంలో సమర్పించారు.
అదేవిధంగా విజయ్ మాల్యా ప్రమోటెడ్ కింగ్ఫిషర్ కూడా సర్వీసు ట్యాక్స్, పెనాల్టీల రూపంలో రూ.1,012.96 కోట్లు బకాయి పడ్డట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు తెలిపారు. మరో రెండు సంస్థలు కూడా రూ.1000 కోట్లకు పైగా సర్వీసు ట్యాక్స్లను ఖజానాకు బకాయి పడినట్టు వెల్లడించారు. అయితే ఈ సమాచారం బహిర్గతం చేయడం నిషేధమని, 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 138 కింద వీటిని అందజేస్తున్నామని సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు.
Advertisement