ఆసియాలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. న్యూయార్క్‌లో ఉన్న తన విలాసవంతమైన 2BHK అపార్ట్‌మెంట్‌ను రూ. 74.53 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవనంలో ‘యాంటిలియా’ లో ఉంటున్న అంబానీ విదేశంలో ఖరీదైన ఆస్తిని విక్రయించడం వార్తల్లో నిలిచింది. అయితే ఎందుకు అమ్మారు, ఎవరెవరి మధ్య ఈ డీల్ జరిగిందనే వివరాలు అందుబాటులో లేవు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్)
న్యూయార్క్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో తన విలాసవంతమైన కాండోస్‌లో ఒక దానిని రూ. 74.53 కోట్లకు (9 మిలియన్ డాలర్లు) విక్రయించారు. ఈ అపార్ట్‌మెంట్ 400 W. 12వ వీధిలోని నాల్గవ అంతస్తులో ఉంది, దీనిని సుపీరియర్ ఇంక్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ అధినేత విక్రయించిన అపార్ట్‌మెంట్‌ప్రముఖ హడ్సన్ నది ఒడ్డున, 3 బాత్‌రూమ్‌లు, కాండోలో 10-అడుగుల ఎత్తైన పైకప్పులు, నాయిస్ ప్రూఫ్ విండోస్, చెఫ్ కిచెన్ హెరింగ్‌బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్‌లు ఉన్నాయి. ఈ భవనం 1919 నాటిదని, దీనిని గతంలో సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ అని పిలిచేవారట. 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో రెన్నోవేట్ 2009లో అమ్మకానికి వచ్చాయి. మార్క్ షటిల్‌వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ మరియు ఇతరులతో సహా కొంతమంది సెలబ్రిటీలు ఇందులో నివసిస్తున్నారు. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో)
కాగా ముఖేష్ అంబానీ నివాసముండే ముంబైలోని యాంటిలియా ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే.దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment