న్యూఢిల్లీ : విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ భాస్కర్ కోరారు. న్యూఢిల్లీలో ఆదివారం కేంద్ర హోం మంత్రిని ఆయన కలుసుకున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి మరణించిందని నిర్దారించిన విషయం తెలిసిందే. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.