గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి! | chandrababu naidu Unsatisfied with ganta srinivasarao over rishiteswari case | Sakshi
Sakshi News home page

గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి!

Published Sat, Aug 1 2015 10:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి!

గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి!

హైదరాబాద్ :  నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు గంటా ఒక్కసారి మాత్రమే యూనివర్సిటీకి వెళ్లడమేంటని బాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినపుడు... ఇలా వ్యవహరించడం సరైన పద్ధతేనా అని మంత్రి గంటాను చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికైనా యూనివర్సిటీలో ర్యాగింగ్పై చర్యలు తీసుకోవాలని మంత్రి గంటాకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు రిషితేశ్వరి మృతి ఘటనపై విచారణ శుక్రవారంతో ముగిసింది. మూడో రోజు విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్‌ దండే, ఐజీ సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రోజుల్లో కమిటి సభ్యులు ప్రభుత్వానికి  నివేదిక ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement