'తెలివైన అమ్మాయి అలా చేయడం దురదృష్టం'
తిరుపతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 'సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. అరాచక శక్తులు, సంఘవిద్రోహక కార్యకలాపాలకు యూనివర్సిటీలు అడ్డగా మారుతున్నాయి. యూనివర్సిటీలో కొందరు నరకం అనుభవిస్తున్నారని రిషితేశ్వరి సూసైడ్ లేఖలో పేర్కొంది. తెలివైన అమ్మాయి అలా చేయడం దురదృష్టకరం. ఇప్పటికే ఈ ఘటనపై నిజనిర్థారణ కమిటీ విచారిస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తాం' అని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కాగా సీనియర్ల ర్యాగింగ్తో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, గుంటూరు జిల్లా నేతలు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు.