
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తికాగా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్గా ఉన్నారు. గతంలో వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు పలుమార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. 77 రోజుల తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది.