Rishiteswari suicide case
-
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: రోజా
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ స్టూడెంట్ రిషితేశ్వరి ఉదంతంలో నిందితులకు ఇంకా శిక్ష పడలేదని, ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారని, సీఎం చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందన్నారు. బ్రిటీష్ పాలన కంటే దారుణంగా చంద్రబాబు పాలన ఉందని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఉపయోగం లేదని భావిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకడుతున్నారని చెప్పారు. అధికారం కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా సిద్దమేనని, కాంగ్రెస్‌లో టీడీపీని వీలినం చేయడానికి రంగం సిద్దమవుతుందని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో బాబు జతకడుతున్నాడని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, వైఎస్సార్సీపీ గెలుపునకు మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు. -
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
-
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి ఎం.రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్‌గా ఉన్నారు. గతంలో వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు పలుమార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. 77 రోజుల తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
మొదటి ముద్దాయిగా ప్రిన్సిపల్ బాబూరావు?
-
రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు.. ఇంకో డైరీ!
సీనియర్ల ర్యాగింగ్, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసులో మరో ఇద్దరు విద్యార్థుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె డైరీలో కొట్టేసిన పేర్లు ఏవో కూడా తెలిసినట్లు సమాచారం. అలాగే, ఆమె రాసుకున్న మరో డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డైరీలో వివరాలు ఏంటనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆ డైరీలో తాను యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఉన్న మధురక్షణాలతో పాటు తాను బాధపడిన కొన్ని విషయాలను కూడా ఆమె రాసుకుందని, అయితే రాతలో మాత్రం కొంత తేడా ఉందని అంటున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన ముగ్గురితో పాటు మరో ఇద్దరు సీనియర్ విద్యార్థుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణలో కూడా వీళ్ల పాత్ర వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిద్దరి తల్లిదండ్రులతో మాట్లాడారు గానీ, ఇంకా విద్యార్థులను అరెస్టు చేయలేదు. ఇక బాలసుబ్రహ్మణ్యం కమిటీ ప్రిన్సిపాల్ బాబూరావు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంది. చాలా విషయాలకు సంబంధించి ఆయన వైఖరి ఏకపక్షంగా ఉన్నట్లు గుర్తించింది. -
'లైంగిక వేధింపులకు ప్రిన్సిపాలే కారకుడు'
వరంగల్:నాగార్జున యూనివర్శిటీలో తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి యూనివర్శిటీల్లో మరే ఇతర అమ్మాయికి ఇలా జరగకూడదన్నారు. అప్పుడే తన కుమార్తె జీవించి ఉన్నట్లు భావిస్తానని తెలిపారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపాల్ బాబూరావునే కారణమని.. ఆ ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందేనని కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ నేరం చేసినందుకు బాబూరావుకు ఎలాంటి శిక్షా విధించలేదన్నారు. లైంగిక వేధింపులకు పూర్తిస్థాయి సహకారాన్ని ప్రిన్సిపాల్ అందించారన్నారు. హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటని ప్రశ్నించారు. ఆ అవార్డు ఇచ్చిన ఫోటో తీసి అందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరమేమిటన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డ బాబూరావుకు ఎలాంటి శిక్ష విధిస్తారని మురళీకృష్ణ అడిగారు. -
పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య
-
పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి
గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు. శుక్రవారం ప్రిన్సిపాల్ బాబూరావుతో పాటు వార్డెన్ స్వరూప రాణిలు లీగల్ సెల్ అథారిటీ ముందు హాజరైన క్రమంలో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కనీసం మీలో పశ్చాత్తాపం కనబడుటం లేదు. కనీసం మీ నాన్నకు నీవైనా చెప్పంటూ పక్కనున్న ప్రిన్సిపాల్ కొడుకును చూస్తూ జడ్జి వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా రిషితేశ్వరి ఆత్మహత్య పై సుమోటోగా స్వీకరించిన కేసును లీగల్ సెల్ అథారిటీ కొట్టేసింది. గురువారం వీసి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నందున అంతకుముందు కోర్టు స్వీకరించిన సుమోటో కేసును జడ్జి కొట్టివేశారు. -
రిషితేశ్వరి కేసు:నిందితుల బెయిల్ పై నేడు విచారణ
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రుషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను శుక్రవారం జిల్లా కోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు మృతురాలు తండ్రి అయిన మొండి మురళీకృష్ణ తనను కూడా రికార్డుపరంగా ప్రతివాదిగా తరపున సీనియర్ న్యాయవాది వైకే బుధవారం పిటిషన్ దాఖలు చేయగా అది గురువారం విచారణకు వచ్చింది. బాధితులు తమకు నచ్చిన న్యాయవాదిని నియమించుకునే హక్కు ఉన్నదని న్యాయమూర్తులు అందుకు అనుమతించాలనే న్యాయసూత్రాన్ని న్యాయవాది వైకే తన వాదన ద్వారా వినిపించారు. వైకే వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి గోపీచంద్ బెయిల్ పిటీషన్లో 2వ ప్రతివాదిగా మురళీకృష్ణను చేర్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు కేసు విచారణను నేటికి వాయిదా వేశారు. -
బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే
రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారణం నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ బాబూరావేనని, ఆయనను ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే... రిషితేశ్వరి తల్లిదండ్రులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు విద్యార్థులు క్యాంప్ ఆఫీసుకువెళ్తే లాఠీ చార్జి చేయిస్తారా? చార్జిషీటులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పేరు పెట్టారు నాగార్జున వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ దీనికి కారణం. వాళ్ల పేర్లు ఎందుకు చేర్చలేదు ప్రిన్సిపల్ బాబూరావు అమ్మాయిలతో తైతక్కలాడతాడు, ఉమనైజర్ అని అంటున్నారు వనజాక్షి కేసులాగే దీన్నీ నీరుగారుస్తున్నారు యాంటీ ర్యాగింగ్ మీద సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది అమాయక విద్యార్థుల జీవితాలు నాశనం కాకూడదని చెప్పింది యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్ లు వేయాలని, వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు బయట ఉండే పిల్లల వివరాలు సేకరించాలని అన్నారు లెక్చరర్లు, ప్రిన్సిపల్ ర్యాగింగ్ మీద కౌన్సెలింగ్ ఇవ్వాలని కూడా అందులో అన్నారు కానీ ఇక్కడ మాత్రం తనకు ర్యాగింగ్ వల్ల చాలా మానసిక ఒత్తిడి ఉందని, రిషితేశ్వరి , ఆమె తండ్రి వచ్చి ఫిర్యాదుచేసినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయమై ఏమంటారు? ర్యాగింగ్ జరిగిందని ఎవరైనా ఫిర్యాదుచేస్తే, పోలీసులకు చెప్పాలి, చర్యలు తీసుకోవాలి కానీ ప్రిన్సిపల్ దాన్ని పక్కన పెట్టడం వల్లే ఆమె చనిపోయింది కాబట్టి ఎ1 ప్రిన్సిపల్, ఎ2 వీసీ అవుతారు కానీ ఇప్పుడు ఆయనంత ఉత్తముడు ఎవరూ లేరని టీడీపీ నాయకులు అంటున్నారు ఇది కేవలం రిషితేశ్వరికి సంబంధించిందే కాదు.. అన్నిచోట్లా జరుగుతోంది యూనివర్సిటీ కులాల కుంపటిగా మారిపోయింది ప్రిన్సిపల్ అమ్మాయిలతో డాన్సులు వేసినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా అడ్డు అదుపు లేదు. ఇలాంటివాళ్లను వదిలితే ఇంకెందరి జీవితాలు నాశనం అవుతాయో చెప్పలేం చంద్రబాబు ఇప్పటికైనా ముందుకొచ్చి, అమ్మాయిలకు అండగా ఉండాలని కోరుతున్నాం కాలేజీలకు సెలవు ఇచ్చేసి, ప్రిన్సిపల్‌కు అనుకూలంగా ఉండేవాళ్లను మాత్రమే పిలిపించి విచారణ చేయిస్తున్నారు ఇంత తప్పు జరిగినా ప్రిన్సిపల్‌ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు, సీడీలలో ఆధారాలున్నా.. అందరూ ఆయనపై పోరాడుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదు? ర్యాగింగ్‌ను కాలేజీల నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు వనజాక్షి విషయంలో గానీ, ఎమ్మెల్యేల విషయంలో గానీ.. తన అనుకూల మీడియాతో దాన్ని నీరుగార్చేలా చేస్తున్నారు దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇందులో మంత్రుల పిల్లలున్నా, టీడీపీ నేతల పిల్లలున్నా వదలం. అమ్మాయి కోరుకున్నట్లుగా, ఆమె తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి ప్రిన్సిపల్‌ను ఎ1గా చేర్చాలి. అమ్మాయి ఆత్మహత్యకు కారకులైన వారందరినీ ర్యాగింగ్ చట్టం కింద అరెస్టు చేయాలి. లేనిపక్షంలో రేపు అసెంబ్లీలో, బయట వైఎస్ఆర్సీపీ వదిలే ప్రసక్తి లేదు 6వ తేదీ పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగం యూనివర్సిటీకి వెళ్తున్నాం. నిజనిర్ధారణ కమిటీగా అక్కడ చూసి, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం -
ర్యాగింగ్‌పై మంత్రివర్గం స్పందించేనా?
* రిషితేశ్వరి మృతి కేసుపై ప్రభుత్వ ఉదాశీనత * క్యాబినెట్లో చర్చిస్తామన్న మంత్రి గంటా మాటలు.. ఒట్టిదేనా? సాక్షి, గుంటూరు: ర్యాగింగ్ కోరలకు బలైన విద్యార్థిని రిషితేశ్వరి కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదు. మొక్కుబడిగా విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తదుపరి చర్యలపైనా పెద్దగా స్పందిస్తున్న దాఖలాల్లేవు. ఘటన జరిగినప్పుడు దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. విద్యార్థిని మృతిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులెవరూ స్పందించడంలేదు. దీంతో ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. రిషితేశ్వరి మృతి అనంతరం ఈ నెల 18న వర్సిటీకి వచ్చిన ఏపీ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి హడావుడి చేశారు. ర్యాగింగ్‌పై ఏపీ సీఎం సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నిర్భయ కంటే కఠిన చట్టాలు తీసుకొస్తామని, దీనిపై ఈనెల 22న రాజమండ్రిలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ విషయాలన్నీ విలేకరులకు, ఫోన్లో మాట్లాడి రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణకు చెప్పారు. అయితే ఈ నెల 22న జరిగిన క్యాబినెట్ భేటీలో ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు తెచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించకపోవడంతో మంత్రి మాటలన్నీ నీటిమూటలేనని తేలిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విజయవాడలో జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా రిషితేశ్వరి వ్యవహారంపై చర్చించి, ర్యాగింగ్‌పై కఠిన చట్టాలు చేయాలని నిర్ణయిస్తారా అన్నది అనుమానంగానే ఉంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని మొండి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.గోపీచంద్ ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేశారు. నిందితుల బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగాల్సి ఉండగా.. ఈ కేసుకు సంబంధించిన డైరీ అందనందువల్ల వాయిదా కావాలని ఏపీపీ కె.రామచంద్రరావు కోరారు. దీంతో పిటిషన్‌ను వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. రిషితేశ్వరి మృతి కేసులో దుంపా హనీషా, దారావత్ జైచరణ్, నరాల శ్రీనివాస్‌లను దోషులుగా పేర్కొంటూ పెదకాకాని పోలీసులు వారిని ఈ నెల 16న అరెస్టుచేశారు. కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఈ నెల 31 వరకు వారికి రిమాండ్ విధించారు.