
ఎమ్మేల్యే రోజా
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ స్టూడెంట్ రిషితేశ్వరి ఉదంతంలో నిందితులకు ఇంకా శిక్ష పడలేదని, ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారని, సీఎం చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందన్నారు. బ్రిటీష్ పాలన కంటే దారుణంగా చంద్రబాబు పాలన ఉందని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో ఉపయోగం లేదని భావిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకడుతున్నారని చెప్పారు.
అధికారం కోసం చంద్రబాబు ఏం చేయడానికైనా సిద్దమేనని, కాంగ్రెస్‌లో టీడీపీని వీలినం చేయడానికి రంగం సిద్దమవుతుందని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో బాబు జతకడుతున్నాడని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, వైఎస్సార్‌సీపీ గెలుపునకు మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment