బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే | principal should be made a1 in rishiteswari case, demands ysrcp mla roja | Sakshi
Sakshi News home page

బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే

Published Fri, Jul 31 2015 2:32 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే - Sakshi

బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే

రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారణం నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ బాబూరావేనని, ఆయనను ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...

రిషితేశ్వరి తల్లిదండ్రులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు
విద్యార్థులు క్యాంప్ ఆఫీసుకువెళ్తే లాఠీ చార్జి చేయిస్తారా?
చార్జిషీటులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పేరు పెట్టారు
నాగార్జున వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ దీనికి కారణం. వాళ్ల పేర్లు ఎందుకు చేర్చలేదు
ప్రిన్సిపల్ బాబూరావు అమ్మాయిలతో తైతక్కలాడతాడు, ఉమనైజర్ అని అంటున్నారు
వనజాక్షి కేసులాగే దీన్నీ నీరుగారుస్తున్నారు
యాంటీ ర్యాగింగ్ మీద సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది
అమాయక విద్యార్థుల జీవితాలు నాశనం కాకూడదని చెప్పింది
యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్ లు వేయాలని, వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు
బయట ఉండే పిల్లల వివరాలు సేకరించాలని అన్నారు
లెక్చరర్లు, ప్రిన్సిపల్ ర్యాగింగ్ మీద కౌన్సెలింగ్ ఇవ్వాలని కూడా అందులో అన్నారు
కానీ ఇక్కడ మాత్రం తనకు ర్యాగింగ్ వల్ల చాలా మానసిక ఒత్తిడి ఉందని, రిషితేశ్వరి , ఆమె తండ్రి వచ్చి ఫిర్యాదుచేసినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయమై ఏమంటారు?
ర్యాగింగ్ జరిగిందని ఎవరైనా ఫిర్యాదుచేస్తే, పోలీసులకు చెప్పాలి, చర్యలు తీసుకోవాలి
కానీ ప్రిన్సిపల్ దాన్ని పక్కన పెట్టడం వల్లే ఆమె చనిపోయింది కాబట్టి ఎ1 ప్రిన్సిపల్, ఎ2 వీసీ అవుతారు
కానీ ఇప్పుడు ఆయనంత ఉత్తముడు ఎవరూ లేరని టీడీపీ నాయకులు అంటున్నారు
ఇది కేవలం రిషితేశ్వరికి సంబంధించిందే కాదు.. అన్నిచోట్లా జరుగుతోంది
యూనివర్సిటీ కులాల కుంపటిగా మారిపోయింది
ప్రిన్సిపల్ అమ్మాయిలతో డాన్సులు వేసినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా అడ్డు అదుపు లేదు.
ఇలాంటివాళ్లను వదిలితే ఇంకెందరి జీవితాలు నాశనం అవుతాయో చెప్పలేం
చంద్రబాబు ఇప్పటికైనా ముందుకొచ్చి, అమ్మాయిలకు అండగా ఉండాలని కోరుతున్నాం
కాలేజీలకు సెలవు ఇచ్చేసి, ప్రిన్సిపల్కు అనుకూలంగా ఉండేవాళ్లను మాత్రమే పిలిపించి విచారణ చేయిస్తున్నారు
ఇంత తప్పు జరిగినా ప్రిన్సిపల్ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు, సీడీలలో ఆధారాలున్నా.. అందరూ ఆయనపై పోరాడుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదు?
ర్యాగింగ్ను కాలేజీల నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు
వనజాక్షి విషయంలో గానీ, ఎమ్మెల్యేల విషయంలో గానీ.. తన అనుకూల మీడియాతో దాన్ని నీరుగార్చేలా చేస్తున్నారు
దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇందులో మంత్రుల పిల్లలున్నా, టీడీపీ నేతల పిల్లలున్నా వదలం.
అమ్మాయి కోరుకున్నట్లుగా, ఆమె తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి
ప్రిన్సిపల్ను ఎ1గా చేర్చాలి. అమ్మాయి ఆత్మహత్యకు కారకులైన వారందరినీ ర్యాగింగ్ చట్టం కింద అరెస్టు చేయాలి.
లేనిపక్షంలో రేపు అసెంబ్లీలో, బయట వైఎస్ఆర్సీపీ వదిలే ప్రసక్తి లేదు
6వ తేదీ పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగం యూనివర్సిటీకి వెళ్తున్నాం. నిజనిర్ధారణ కమిటీగా అక్కడ చూసి, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement