నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు. శుక్రవారం ప్రిన్సిపాల్ బాబూరావుతో పాటు వార్డెన్ స్వరూప రాణిలు లీగల్ సెల్ అథారిటీ ముందు హాజరైన క్రమంలో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.