principle babu rao
-
'లైంగిక వేధింపులకు ప్రిన్సిపాలే కారకుడు'
వరంగల్:నాగార్జున యూనివర్శిటీలో తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి యూనివర్శిటీల్లో మరే ఇతర అమ్మాయికి ఇలా జరగకూడదన్నారు. అప్పుడే తన కుమార్తె జీవించి ఉన్నట్లు భావిస్తానని తెలిపారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపాల్ బాబూరావునే కారణమని.. ఆ ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందేనని కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ నేరం చేసినందుకు బాబూరావుకు ఎలాంటి శిక్షా విధించలేదన్నారు. లైంగిక వేధింపులకు పూర్తిస్థాయి సహకారాన్ని ప్రిన్సిపాల్ అందించారన్నారు. హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటని ప్రశ్నించారు. ఆ అవార్డు ఇచ్చిన ఫోటో తీసి అందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరమేమిటన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డ బాబూరావుకు ఎలాంటి శిక్ష విధిస్తారని మురళీకృష్ణ అడిగారు. -
పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య
-
పిల్లలతో డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య:జడ్జి
గుంటూరు: నాగార్జున యూనివర్శిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై గుంటూరు జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో ప్రిన్సిపాల్ డాన్సులు చేయడం సిగ్గుమాలిన చర్య అని బాబూరావు వైఖరిని తప్పుబట్టారు. శుక్రవారం ప్రిన్సిపాల్ బాబూరావుతో పాటు వార్డెన్ స్వరూప రాణిలు లీగల్ సెల్ అథారిటీ ముందు హాజరైన క్రమంలో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కనీసం మీలో పశ్చాత్తాపం కనబడుటం లేదు. కనీసం మీ నాన్నకు నీవైనా చెప్పంటూ పక్కనున్న ప్రిన్సిపాల్ కొడుకును చూస్తూ జడ్జి వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా రిషితేశ్వరి ఆత్మహత్య పై సుమోటోగా స్వీకరించిన కేసును లీగల్ సెల్ అథారిటీ కొట్టేసింది. గురువారం వీసి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నందున అంతకుముందు కోర్టు స్వీకరించిన సుమోటో కేసును జడ్జి కొట్టివేశారు.