గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు | ysrcp leaders arrested in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు

Published Fri, Jul 31 2015 10:09 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ysrcp leaders arrested in guntur district

గుంటూరు: గుంటూరులో విద్యా సంస్థల బంద్ సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం గుంటూరులో విద్యా సంస్థల బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చాయి. దీంతో  శుక్రవారం విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి.

బంద్‌లో పాల్గొనాలని కోరుతున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య, నగర అధ్యక్షుడు మణికంఠ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీలతోపాటు 45 మంది వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement