Bund
-
Breaking News: టాలీవుడ్లో షూటింగ్‌లు బంద్..!
-
వస్త్ర దుకాణాల బంద్
-జీఎస్టీ విధింపుపై వ్యాపారుల నిరసన -జిల్లావ్యాప్తంగా మూతపడిన షాపులు భీమవరం (ప్రకాశం చౌక్) : వస్త్రాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వ్యాపారులు దుకాణాలను మూసి వేశారు. ఆలిండియా వస్త్ర వ్యాపారుల పిలుపు మేరకు బంద్ చేపట్టినట్టు సంఘాల నేతలు తెలిపారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ చేపట్టి దుకాణాలు మూసి వేశారు. భీమవరంలోని సుమారు 300 బట్టల షాపులు తెరుచుకోలేదు. ఈ సందర్భంగా క్లాత్ మర్చంట్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు అయిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలిండియా వస్త్ర వ్యాపారుల పిలుపు మేరకు భీమవరంలో క్లాత్ మర్చంట్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. దుస్తులపై ఇప్పటివరకు లేని టాక్సును ఒక్కసారిగా 12 శాతం వేయడం దారుణమన్నారు. పన్ను భారం పడి వస్త్రాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వారికి వస్త్రాల కొనుగోలు పెను భారంగా మారుతుందన్నారు. దాంతో కొనుగోళ్లు లేక నష్టాలతో వేల సంఖ్యలో వ్యాపార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. వస్త్రాలపై మునుపెన్నడూ లేని ఈ టాక్సును రద్దు చేయాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల ద్వారా వినతి చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎంపీ గంగరాజుకు వినతిపత్రం అందజేశామన్నారు. అలాగే తహసీల్దార్‌కు, కమర్షియల్ టాక్సు ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ శిల్్క్స రమేష్, దేవీక్లాత్ వెంకన్నబాబు, ఎ.రంగారావు, శ్రీనిధి అప్పారావు, విలాసా క్లాత్ అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు
జంగారెడ్డిగూడెం : ఆంధ్రా, ఒడిశా బోర్డర్లో ఇటీవల ఎన్కౌంటర్ జరగడం, మావోయిస్టులు ఈనెల3న బంద్‌కు పిలుపునివ్వడం తదితర పరిణామాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. బాంబ్ స్క్వాడ్‌తో ప్రధాన కూడళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది. నాలుగు రోజలుగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది ఏఆర్ ఎస్ఐ ఎబినేజర్, కానిస్టేబుళ్లు విజయ్‌కుమార్, అఖిల్, బాలకృష్ణ ఈ తనిఖీలు నిర్వహించారు. శనివారం జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్, పారిజాతగిరి దేవాలయం, గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం, చింతలపూడి బస్టాండ్లలో బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతికార చర్యకు పాల్పడే ఆస్కారం ఉన్నందున ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఏలూరు, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ల పరిధిలోని ప్రధానమైన, జనసమ్మర్ధం ఉండే సుమారు 75 ప్రాంతాలను గుర్తించి అణువణువూ తనిఖీలు చేశారు. -
హౌస్ అరెస్టుల పర్వం..
-
నేడు కల్లూరు బంద్
అఖిలపక్ష సమావేశానికి హాజరుకాని నాయకులు బంద్‌కు సహకరించాలని కోరిన జేఏసీ కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నాయకులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. అఖిలపక్షం నాయకులను ఆహ్వానించారు. అధికార పార్టీ నాయకులు సమావేశానికి హాజరుకాలేదు. కేవలం అఖిలపక్షం జేఏసీ చైర్మన్ చారుగుండ్ల అచ్చుతరావు, కొప్పురావూరి ఆంజనేయులు మాత్రమే హాజరయ్యారు. దీంతో బంద్ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఎంపీపీ వలసాల జయలక్ష్మి, జెడ్పీటీసీ లీలావతి, ఆత్మ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, భూక్యా రామూనాయక్, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, వలసాల నర్సింహారావు, ఆత్మ డైరెక్టర్ పుసులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, కల్లూరును రెవెన్యూ డివిజన్ చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఇది ఏర్పాటవుతుందని, బంద్ పిలుపును ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నాయకులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఫోన్లో సమాచారం అందించారు. బంద్‌కు సహకరించాలి.. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ల యజమానులు, పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కర్నాటి అప్పిరెడ్డి, గొర్రెపాటి రాధయ్య, కాటమనేని వెంకటేశ్వరరావు, ఏ.వెంకన్న, జాస్తి శ్రీనివాసరావు, దామాల రాజు కోరారు. -
పదునెక్కిన నినాదం
-
తేలని ‘భవిత’వ్యం!
– నిలిచిపోయిన ఫిజియో థెరపీ క్యాంపులు – రెన్యూవల్‌కు నోచుకోని ఫిజియోథెరపిస్టులు – సేవల కోసం ‘ప్రత్యేక’ పిల్లల ఎదురుచూపు ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా నడుస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించకపోవడమే ఇందుకు నిదర్శనం. విద్యా సంవత్సరం ప్రారంభమై మూన్నెళ్లవుతున్నా...ఫిజియో థెరపిస్టులను తీసుకోలేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఫిజియో థెరపీ సేవల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు బుద్ధిమాంద్యత (ఎంఆర్), దష్టి లోపం (బ్లైండ్), వినికిడి (హెచ్ఐ), సీపీ (సెరబ్రల్పాల్సీ) గల పిల్లలు అధికారిక లెక్కల ప్రకారం 6080 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో ఐఈఆర్సీ (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్), 43 మండలాల్లో నాన్–ఐఈఆర్సీలు ఉన్నాయి. ఈ పిల్లల కోసం ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ) 115 మంది పని చేస్తున్నారు. తీవ్రతను బట్టి కొందిరి పిల్లలకు హోం బేస్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. రెన్యూవల్‌కు నోచని ఫిజియో థెరపిస్టులు ప్రతి సోమవారం ఐఈఆర్సీ కేంద్రాలు, బుధ, శుక్రవారాల్లో నాన్–ఐఈఆర్సీ కేంద్రాల్లో ఫిజియోథెరపీ క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. ఫిజియో థెరపిస్టులు వచ్చి పక్షవాతం, కాళ్లు, చేతులు సరిగా పని చేయకపోవడం, కండరాలు, ఎముకలు పట్టేసి నడవడానికి, పనులు చేసుకోవడానికి వీలుకాక ఇబ్బందులు పడుతున్న పిల్లలకు ఫిజియోథెరపీ చేస్తారు. గతేడాది 26 మంది ఫిజియో థెరపిస్టులు జిల్లాలో పని చేశారు. ఈ సంవత్సరంలో మూడు మండలాలకు ఒక్కరి చొప్పున 21 మందిని తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ రెన్యూవల్ ప్రక్రియ జరగలేదు. ఆయాలదీ అదే పరిస్థితి మరోవైపు కేర్ గివర్ వలంటీర్ల (ఆయా)ను తీసుకోలేదు. వీరు లేకపోవడంతో భవిత కేంద్రాలకు తమ పిల్లలను పంపేందుకు కూడా తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. కేంద్రంలో ఉన్న సమయంలో ముఖ్యంగా బుద్ధిమాంద్య పిల్లలకు వ్యక్తిగత అవసరాలు వస్తే వాటిని తీర్చుకునేందుకు తోడు కచ్చితంగా అవసరం. ఫిజియెథెరపీ క్యాంపులు పెట్టడం లేదు కూడేరులోని భవిత కేంద్రంలో మూన్నెళ్లుగా ఫిజియో థెరపీ క్యాంపు నిర్వహించడం లేదు. నా మనవుడు సందీప్‌కు నరాల బలహీనతతో కాళ్లు సచ్చు(సెరబ్రల్) బడ్డాయి. ఫిజియోథెరఫి చేస్తే నరాలు బలపడతాయని వైద్యులు చెప్పారు. గతేడాదిలో భవిత కేంద్రంలో రెగ్యులర్‌గా చేయించాం. ప్రైవేటుగా వెళ్లి ఫిజియోథెర పీ చేయించుకోవాలంటే ఆర్థిక భారమవుతుంది. – గోపాల్ ముద్దలాపురం, కూడేరు మండలం అనుమతులు రావాలి ఫిజియో థెరపీ క్యాంపులు లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్న సంగతి వాస్తవమే. ఫిజియోథెరపిస్టులను తీసుకోవాలంటే పై నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గతేడాది 26 మంది పని చేశారు. ఈసారి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టును తీసుకోవాలనే నిబంధన ఉంది. ఆ ప్రకారం త్వరలోనే తీసుకుంటాం. – పాండురంగ, ఐడీ కోఆర్డినేటర్ -
ఒడిశాలో బంద్‌తో రైళ్ల ఆలస్యం
ఇచ్ఛాపురం (కంచిలి) : ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన బంద్ కారణంగా ఆంధ్రా వైపు వచ్చే పలు రైళ్లు మంగళవారం ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రైళ్ల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. స్టేషన్లో వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులతో ప్రయాణానికి వచ్చిన వారు అవస్థలు పడ్డారు. బంద్ కారణంగా ఉదయం 8.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 11.05 గంటలకు, 9.30 గంటలకు రావాల్సిన హౌరా–చెన్నై మెయిల్ మధ్యాహ్నం 12.28 గంటలకు, 10.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ 11.34 గంటలకు వచ్చాయి. భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ 11.59 గంటలకు వచ్చింది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. -
బంద్‌ను విజయవంతం చేయండి
కావలిఅర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి పిలుపునిచ్చారు. స్థానిక కసాయివీధిలోని సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయను మాట్లాడారు. తమ సంఘంతో పాటు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను తొలగించి పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోందని విమర్శించారు. మెస్‌బిల్లులు పెంచకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి మధు మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మనోజ్, సాయి, ప్రకాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
రేపు మన్యం బంద్
పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడానికైనా వెనకాడమని వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. వామపక్ష నాయకులు విశాఖ మన్యం ప్రాంతంలో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. -
వైఎస్ఆర్ జిల్లాలో కార్యకర్తలు అరెస్ట్
-
గుంటూరులో వైఎస్సార్సీపీ నేతల అరెస్టు
గుంటూరు: గుంటూరులో విద్యా సంస్థల బంద్ సందర్భంగా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం గుంటూరులో విద్యా సంస్థల బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చాయి. దీంతో శుక్రవారం విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించాయి. బంద్‌లో పాల్గొనాలని కోరుతున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య, నగర అధ్యక్షుడు మణికంఠ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీలతోపాటు 45 మంది వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. -
'ఎక్కడైనా రిజిస్ట్రేషన్' నిలిపివేత
కొత్తపేట(గుంటూరు): హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ర్ట వ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని నిలిపివేస్తూ ఆ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు గుంటూరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ బి.సూర్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ (ఎనీవేర్) చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 21న ఇది అమల్లోకి వచ్చింది. దీనిపై కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి చెందిన పి.దేవేందర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. సోమవారం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలుపదల చేస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
వాడిపోతున్న పచ్చతోరణం
సాక్షి, కాకినాడ :మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు, నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలన్నది ఉపాధి హామీ పథకం ద్వారా అమలయ్యే పచ్చతోరణం, గట్లపై మొక్కల పెంపకం పథకాల లక్ష్యం. జిల్లాలో ఈ ఏడాది రూ.155 కోట్లతో 10, 774 ఎకరాల్లో మొక్కలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 8 వేల ఎకరాల్లో ఉద్యాన వన పంటలు, 2666 ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్, 108 ఎకరాల్లో ఐపీటీ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టారు. ఉద్యానవన మొక్కల పెంపకం వరకు లక్ష్యాన్ని అధిగమించినా..బండ్ ప్లాంటేషన్, పచ్చ తోరణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారయ్యాయి. ఐపీటీతో పాటు ఉద్యానవన ప్రాజెక్టు కింద ఒక్కో మొక్కకు రూ.15, మంచినీటి సదుపాయానికి రూ.4.15, పొలంగట్లపై నాటే మొక్కలకు రూ.5 చొప్పున మంజూరు చేస్తారు. బండ్ ప్లాంటేషన్‌కు రెండేళ్లు, ఉద్యానవన పంటలకు మూడేళ్లు , ఐపీటీకి ఐదేళ్ల పాటు ఈ నిర్వహణా నిధులు ఇస్తారు. పొలంగట్లపై నాటేందుకు ఒక్కో రైతుకు ఎకరాకు 100 నుంచి 150, ఐపీటీ కింద వంద నుంచి 200 మొక్కలు అందజేస్తారు. ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పనిచేసిన ఎస్సీ, ఎస్టీలకు మొక్కలను అప్పగించి వాటిని సంరక్షించడానికి కొంత డబ్బును అందించాలి. మొక్కలు పెరిగాక వాటి పండ్లు, కాయలను విక్రయించి లబ్ధిదారులు ప్రయోజనం పొందవచ్చు. 8 వేల ఎకరాల్లో ఉద్యానవన మొక్కలు పెంచాల్సి ఉండగా రూ.3.67కోట్లతో 11,616 ఎకరాల్లో మొక్కలు పెంచి రికార్డు సృష్టించారు. 2666 ఎకరాల్లో బండ్ ప్లాంటేషన్ చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.77లక్షల వ్యయంతో కేవలం 26 మండలాల పరిధిలో 466 ఎకరాల్లో సుమారు పదివేల టేకు మొక్కలు మాత్రమే నాటగలిగారు. పచ్చతోరణం ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. జిల్లాలో 108 ఎకరాల్లో ఈ పథకాన్ని చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.22 లక్షలతో నాలుగంటే నాలుగు ఎకరాల్లో కేవలం 300 మొక్కలు మాత్రమే నాటగలిగారు. లక్ష్యాలే ఘనం.. సాధించింది స్వల్పం బండ్ ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోకపోవడంలో అధికారుల చిత్తశుద్ధి లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గట్లపై టేకుమొక్కల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని రైతులకు అవగాహన కల్పించడానికి అధికారులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఈ పథకం కింద ఈ ఏడాది 2,985 మంది రైతుల పొలం గట్లపై 5.11 లక్షల మొక్కలు పెంచాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు మొక్కలు నాటేందుకు కేవలం 60 వేల గోతులు తవ్వగా, 10 వేల మొక్కలు మాత్రమే నాటగలిగారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల శిఖం భూములు, ఏటిగట్లు, ఆర్ అండ్ బి రహదారులతో పాటు ఇతర ప్రభుత్వ భూముల్లో కొబ్బరి, మామిడిమొక్కలు నాటి, అవి బతికే వరకూ ఉపాధి సిబ్బందే పెంచి, అనంతరం పెంపకం బాధ్యతను అర్హులైన ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు అప్పగించాలన్నది పచ్చతోరణం లక్ష్యం. పూర్తిగా ప్రభుత్వ భూముల్లోనే మొక్కలు పెంచాల్సి ఉండగా సంబంధిత శాఖలను సమన్వయపర్చి భూములను గుర్తించడంలో ఉపాధి హామీ అధికారులు విఫలమయ్యారు. జిల్లాలో కేవలం రాజమండ్రి రూరల్‌లో రెండెకరాల్లో, కోరుకొండ, రాజోలు మండలాల్లో ఒక్కో ఎకరంలో మాత్రమే ఈ ప్రాజెక్టును చేపట్ట గలిగారు. కేవలం మూడు మండలాల్లో నలుగురంటే నలుగురు ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే లబ్ధి చేకూర్చ గలిగారు. అలాగే నాటిన మొక్కలను లబ్ధిదారులకు అప్పగించే వరకూ పెంచడంలో కూడా విఫలమవుతున్నారు.దీనిపై డ్వామా అధికారులను వివరణ కోరగా బండ్ ప్లాంటేషన్ విషయంలో రైతుల్లో మరింత చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక పచ్చతోరణం విషయానికొస్తే.. ప్రభుత్వ భూములను గుర్తించి తమకు అప్పగించడంలో వివిధ శాఖల అధికారులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.