మాట్లాడుతున్న కట్టా అజయ్‌కుమార్
- అఖిలపక్ష సమావేశానికి హాజరుకాని నాయకులు
- బంద్‌కు సహకరించాలని కోరిన జేఏసీ
కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగంగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. అఖిలపక్షం నాయకులను ఆహ్వానించారు. అధికార పార్టీ నాయకులు సమావేశానికి హాజరుకాలేదు. కేవలం అఖిలపక్షం జేఏసీ చైర్మన్ చారుగుండ్ల అచ్చుతరావు, కొప్పురావూరి ఆంజనేయులు మాత్రమే హాజరయ్యారు. దీంతో బంద్ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో ఎంపీపీ వలసాల జయలక్ష్మి, జెడ్పీటీసీ లీలావతి, ఆత్మ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, భూక్యా రామూనాయక్, లక్కినేని రఘు, పసుమర్తి చందర్‌రావు, వలసాల నర్సింహారావు, ఆత్మ డైరెక్టర్ పుసులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, కల్లూరును రెవెన్యూ డివిజన్ చేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని, త్వరలోనే ఇది ఏర్పాటవుతుందని, బంద్ పిలుపును ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నాయకులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఫోన్‌లో సమాచారం అందించారు.
బంద్‌కు సహకరించాలి..
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్న ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, హోటళ్ల యజమానులు, పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కర్నాటి అప్పిరెడ్డి, గొర్రెపాటి రాధయ్య, కాటమనేని వెంకటేశ్వరరావు, ఏ.వెంకన్న, జాస్తి శ్రీనివాసరావు, దామాల రాజు కోరారు.