
సాక్షి మహబూబాబాద్: ఆయన తహశీల్దార్.. నిత్యం ఆఫీస్‌లో ఫైళ్లతో కుస్తీ పడుతుంటారు. ఎప్పుడూ రెవెన్యూ పని మీదే బిజీగా ఉంటారు. అయితే పనులన్నింటినీ కాసేపు పక్కకుపెట్టి సరదాగా గడిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన తహశీల్దార్ నూతన సంవత్సరం వేడుకల్లో డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. కల్లూరు మండల రెవెన్యూ అధికారిగా మంగీలాల్ విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం రెవిన్యూ పరిధిలో పనులతో బిజీగా గడిపే తహశీల్దార్ నూతన సంవత్సర వేడుకల్లో తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
మంగీలాల్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని బలపాలపల్లి గ్రామం.అయితే అక్కడ జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో స్నేహితులతో కలిసి చిందేశారు. డ్యాన్సర్‌లకు ధీటుగా స్టెప్పులు వేస్తూ అలరించారు. అచ్చం మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులతో రఫ్ఫాడించాడు. ప్రస్తుతం తహశీల్దార్ మంగీలాల్ డ్యాన్స్ చేసిన వీడియో స్థానిక వాట్సప్ గ్రూప్‌లలో వైరల్‌గా మారింది.
చదవండి: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే..