ఆత్మహత్యకు పాల్పడిన వెంకటేశ్వర్లు
సాక్షి, కల్లూరు: కుటుంబ కలహాల వల్ల మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కల్లూరులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. కల్లూరు అంబేడ్కర్ నగర్‌కు చెందిన పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు (32) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం పురుగు మందు తాగి మృతి చెందాడు. వెంకటేశ్వర్లు కులాంతర వివాహం చేసుకుని ఖమ్మంలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. శివరాత్రి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కల్లూరు వచ్చారు. బుధవారం రాత్రి వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె మొదటి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
అనంతరం భార్య, భర్తల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో భార్య సౌజన్య ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. ఆమెను వెంటనే కల్లూరులోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఆమెను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు కప్పలబంధం రోడ్ సమీపంలో శ్మశాన వాటిక దగ్గర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అటు వెళ్తున్న హోమ్‌గార్డు గమనించి కొన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment