పాడేరు: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడానికైనా వెనకాడమని వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. వామపక్ష నాయకులు విశాఖ మన్యం ప్రాంతంలో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు.