ఇచ్ఛాపురం స్టేషన్‌లో రైళ్ల ఆలస్యంతో వేచి ఉన్న ప్రయాణికులు
ఒడిశాలో బంద్‌తో రైళ్ల ఆలస్యం
Published Tue, Aug 16 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
ఇచ్ఛాపురం (కంచిలి) : ఒడిశా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన బంద్ కారణంగా ఆంధ్రా వైపు వచ్చే పలు రైళ్లు మంగళవారం ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రైళ్ల కోసం వేచి ఉండాల్సి వచ్చింది. స్టేషన్‌లో వేచి ఉండేందుకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులతో ప్రయాణానికి వచ్చిన వారు అవస్థలు పడ్డారు. బంద్ కారణంగా ఉదయం 8.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 11.05 గంటలకు, 9.30 గంటలకు రావాల్సిన హౌరా–చెన్నై మెయిల్ మధ్యాహ్నం 12.28 గంటలకు, 10.20 గంటలకు రావాల్సిన భువనేశ్వర్–విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 11.34 గంటలకు వచ్చాయి. భువనేశ్వర్–సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్ 11.59 గంటలకు వచ్చింది. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు.
Advertisement