వస్త్ర దుకాణాల బంద్
-జీఎస్టీ విధింపుపై వ్యాపారుల నిరసన
-జిల్లావ్యాప్తంగా మూతపడిన షాపులు
భీమవరం (ప్రకాశం చౌక్) : వస్త్రాలపై జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వ్యాపారులు దుకాణాలను మూసి వేశారు. ఆలిండియా వస్త్ర వ్యాపారుల పిలుపు మేరకు బంద్ చేపట్టినట్టు సంఘాల నేతలు తెలిపారు. భీమవరం క్లాత్ మర్చంట్స్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ చేపట్టి దుకాణాలు మూసి వేశారు. భీమవరంలోని సుమారు 300 బట్టల షాపులు తెరుచుకోలేదు. ఈ సందర్భంగా క్లాత్ మర్చంట్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు అయిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆలిండియా వస్త్ర వ్యాపారుల పిలుపు మేరకు భీమవరంలో క్లాత్ మర్చంట్ అసోసియేష¯ŒS ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరిగిందన్నారు. దుస్తులపై ఇప్పటివరకు లేని టాక్సును ఒక్కసారిగా 12 శాతం వేయడం దారుణమన్నారు. పన్ను భారం పడి వస్త్రాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వారికి వస్త్రాల కొనుగోలు పెను భారంగా మారుతుందన్నారు. దాంతో కొనుగోళ్లు లేక నష్టాలతో వేల సంఖ్యలో వ్యాపార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతామన్నారు. వస్త్రాలపై మునుపెన్నడూ లేని ఈ టాక్సును రద్దు చేయాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల ద్వారా వినతి చేసే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుకు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎంపీ గంగరాజుకు వినతిపత్రం అందజేశామన్నారు. అలాగే తహసీల్దార్‌కు, కమర్షియల్ టాక్సు ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ శిల్‌్క్స రమేష్, దేవీక్లాత్ వెంకన్నబాబు, ఎ.రంగారావు, శ్రీనిధి అప్పారావు, విలాసా క్లాత్ అమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.