ముందుగా 9 శాఖల తరలింపు
హైదరాబాద్: ఏపికి సంబంధించిన 9 ముఖ్యమైన శాఖలను గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ, విజయవాడ, గొల్లపూడిలకు తరలించాలని నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన హెచ్డీఓల తరలింపు కమిటీ సమావేశం ముగిసింది. బుధవారం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.
ఏప్రిల్ తరువాత తొలివిడతగా ప్రభుత్వ శాఖలను తరలించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ముందుగా హొం, విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక, రెవిన్యూ, మునిసిపల్, మత్స్య, అగ్నిమాపక శాఖలను తరలించాలని నిర్ణయించారు.
**