
వలంటీర్ తల్లిదండ్రులకు వైఎస్సార్ సీపీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున
గుంటూరు (వేమూరు) నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలంలోని గోవాడకు చెందిన కనపర్తి దినేష్ ఈనెల 9న వైఎస్సార్ సీపీ ప్లీనరీకి వెళ్లి వస్తూ నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి పార్టీ తరఫున వలంటీర్ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం.. మంత్రి మేరుగ నాగార్జున బుధవారం సాయం అందించారు. జగనన్న బీమా పథకం ద్వారా కూడా లబ్ధి వచ్చేటట్టు చూస్తామన్నారు. దినేష్ తల్లిదండ్రులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment