కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు | nagarjuna university assistant professor booked under molestation | Sakshi
Sakshi News home page

కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు

Published Wed, Dec 18 2013 10:35 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

nagarjuna university assistant professor booked under molestation

పెదకాకాని: నాగార్జున వర్సిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి. యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో విజయనగరానికి చెందిన ఓ విద్యార్థిని బీటెక్ మెకానికల్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తోంది.

ఆ విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకిషోర్ ఈనెల 15న విద్యార్థిని ఫోన్‌కు ఓ మెసేజ్ పెట్టాడు. 16న డిపార్ట్‌మెంట్‌కు ఒక్కదానివే రావాలని, పర్సనల్‌గా మాట్లాడాలని అందులో ఉంది. ఆమె  సహ విద్యార్థినిని తోడు తీసుకుని వెళ్లగా ఆమె ను బయటకు పంపి, బాధిత విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, మరో వ్యక్తితో ఆమె కలసి ఉండటం ముగ్గురం చూశామనీ, వారితోనూ మాట్లాడమని చెప్పాడు.

ఇంకా లాప్‌టాప్‌లో విద్యార్థిని ఫేస్‌తో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలను చూపాడు. అతడినుంచి తప్పించుకుని వచ్చిన వి ద్యార్థిని ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. 16వ తేదీ రాత్రి కూడా కృష్ణకిషోర్ మెసేజ్ పెట్టడంతో మంగళవారం తండ్రిని రప్పించి తనతో కలసి పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి డిఎస్పీ ఎం మధుసూదనరావు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement