నాగార్జున యూనివర్సిటీ అతిథి గృహంలో స్నానం చేస్తున్న విద్యార్థినిని ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇది గుర్తించిన యువతి బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘జెర్మి ట్రైన్ ద ట్రైనీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఛత్తిస్‌గఢ్ రాయ్‌పూర్ నుంచి విద్యార్థినుల బృందం నాగార్జున యూనివర్సిటీకి వచ్చింది. వీరికి యూనివర్సిటీ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఓ విద్యార్థిని బాత్‌రూంలో స్నానం చేస్తుండగా.. తలుపు పై భాగం నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఇది గుర్తించిన విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది.
దీంతో అతిథిగృహ సిబ్బంది యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియల్ టూర్ కోసం వచ్చిన ఓ కళాశాలకు చెందిన బీబీఏ విద్యార్థులు ఈ ఘటనకు ప్పాలడి ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనుమానం వచ్చిన అందరి సెల్‌ఫోన్‌లను సేకరించి అందులోని చిత్రాలను పరిశీలించారు. ఈ దర్యాప్తులో సాయి శ్రీకర్ అనే విద్యార్థి ఈ చర్యకు పల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీకర్ అనంతపురం జిల్లా పామిడి కి చెందిన వాడిగా గుర్తించారు.
విద్యార్థిని స్నానం చేస్తుండగా.. చిత్రించిన వ్యక్తి అరెస్ట్
Published Tue, Feb 9 2016 10:34 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement