industrial tour
-
త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్': మేకపాటి
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అంగీకరించిందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. బీహెచ్ఈఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లే విధంగా ఒక కేంద్ర బృందం ఏర్పాటు చేయనున్నట్లు సీఎండీ సింఘాల్ చెప్పారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. ఈ బృందాన్ని నడిపించేలా నోడల్ అధికారి నియమించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. బీహెచ్ఈఎల్ సీఎండీ, నీతి ఆయోగ్ సీఈవో తో సమావేశమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆర్డీవో ఛైర్మన్, నేవీ అధ్యక్షుడు, వైమానికదళ ప్రధాన అధికారులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటి ఆలోచనలకు ప్రశంసలు అందాయి. (సీఎం జగన్ విజన్‌కు అభినందనలు) మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు కేంద్రంలోని ప్రముఖులు నీరాజనం పలుకుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దొనకొండలో 'సోనిక్ సిస్టమ్' ఏర్పాటుకు సానుకూలత చూపారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అసలైన పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడేనన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ నలిన్ సింఘాల్‌తో మంత్రి మేకపాటి సమావేశమయ్యారు. ఏపీ పారిశ్రామిక ప్రగతిపై మంత్రి మేకపాటికి గల ఆలోచనలను బీహెచ్ఎల్ సీఎండీ ప్రశంసించారు. విశాఖలో 'డిజిటల్ కాన్క్లేవ్' ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలిపారు. (‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’) ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, బీహెచ్ఈఎల్ సంయుక్తంగా నైపుణ్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే కార్యక్రమంలో భాగస్వామ్యమవ్వాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. మంత్రి మేకపాటి ఇతర ప్రతిపాదనల పట్ల కూడా బీహెచ్ఈఎల్ సీఎండీ నలిన్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. ఐటీఐ కాలేజీలకు తోడ్పాటు, నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యమవుతామని మంత్రికి తెలిపారు. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఎంట్రిప్యూనర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. అనంతరం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక సోలార్ పానల్స్ ఏర్పాటు మంత్రి మేకపాటి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ పాల్గొన్నారు. (ఏపీలో కొత్తగా 9999 కరోనా కేసులు) నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. అక్టోబర్ నుంచి ఎప్పుడైనా విశాఖలో 'డిజిటల్ సదస్సు' నిర్వహించేందుకు అమితాబ్ కాంత్ సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన, కీలక సంస్కరణలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను అమితాబ్ కాంత్ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కరోనా విపత్తు సమయంలో దేశంలోనే తొలుత స్పందించి ఎమ్ఎస్ఎమ్ఈలకు ఆర్థిక అండగా నిలిచిన ఏకైక రాష్ట్రం ఏపీ అని నీతి ఆయోగ్ సీఈవో ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులలో ఏపీ మొదటి స్థానం కైవసం చేసుకోవడాన్ని ఆయన అభినందించారని మంత్రి పేర్కొన్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వ పాలన బాగుంది ఏపీ పారిశ్రామిక విధానం గురించి ప్రస్తావించిన అమితాబ్ కాంత్. అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ కాపీ కావాలని మంత్రిని అడిగారు. ఒకసారి పాలసీ కాపీ చదవుతానని నీతి ఆయోగ్ సీఈవో అన్నట్లు మంత్రి తెలిపారు. కరోనా విపత్తులో, ఆర్థిక లోటులో ప్రభుత్వ పాలన బాగుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించినపుడే భారతదేశ అభివృద్ధి జరిగినట్లని మంత్రి మేకపాటితో అమితాబ్ కాంత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గురించి అమితాబ్ కాంత్ ఆరా తీశారు . సీఎం జగన్ నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్న తీరును ఫోటోల ద్వారా అమితాబ్ కాంత్ మంత్రి మేకపాటి వివరించారు. ఈశాన్య భారత్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పోర్టుల పాత్ర కీలకమని, ఏపీలో జాతీయ స్థాయి పోర్టుగా భావనపాడు పోర్టును తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం ఉంటుందని నీతి ఆయోగ్ సీఈవో వెల్లడించారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న 30 నైపుణ్య కళాశాలలకు సహకారమందించాలని మంత్రి మేకపాటి కోరారు. వ్యవసాయం, పరిశ్రమలే రాష్ట్ర రెవెన్యూకి కీలకమని, అందుకు కేంద్ర సహకారమందించాలని మంత్రి కోరగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. పాఠశాల విద్య పూర్తయ్యే స్థాయి నుంచే నైపుణ్యం సాధించే విధంగా నైపుణ్య మానవవనరులుగా తీర్చిదిద్దేందుకు అన్ని రంగాలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటయ్యే విధంగా చూడాలని నీతి ఆయోగ్ సీఈవోను ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ కోరారు. ఏపీ నుంచి 8-9 యూరప్ దేశాలకు అవసరమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతులలో కీలకమైన విశాఖ పోర్టుకు మరింత ఎగుమతుల సామర్థ్యం పెంచేందుకు అనుమతులు, సహకారం కావాలని విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మ నీతి ఆయోగ్ సీఈవోను కోరారు. ఏపీ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. 'డిఫెన్స్'పై ప్రత్యేక దృష్టి డీఆర్డీవో, నావికా, వైమాణికదళ ప్రధాన అధికారులతో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఏపీ కొత్త పారిశ్రామిక విధానంలో 'డిఫెన్స్'పై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఆ రంగంలో అభివృద్ధికి డీఆర్డీవో సహకారం కావాలని మంత్రి మేకపాటి కోరారు. నౌకదళాల అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. దొనకొండలో సోనిక్ (ధ్వని తరంగాలకు సంబంధించిన) వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద యుద్ధాల సమయంలో ఉపయోగపడే 'నేవీ బేస్' స్థాపించాలని మంత్రి మేకపాటి కోరారు. యుద్ధాలు జరిగే సమయంలో ఏవైనా విమానాలు, ఓడలు మరమ్మతులకు గురైనపుడు నేవీ ఆధ్వర్యంలో నావల్ బేస్ ద్వారా విమానాలకు ఓడలలో తాత్కాలికంగా ఆశ్రయం పొందే అవకాశముంటుందన్నారు. అనంతరం, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవాను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలోని రక్షణ వ్యవస్థ, అభివృద్ధికి సహకారం కోసం మంత్రి మేకపాటి చర్చించారు. ఈ సమావేశం అనంతరం మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంత్రి మేకపాటి హైదరాబాద్ చేరారు. -
సీఎం జగన్ విజన్‌కు అభినందనలు
సాక్షి,అమరావతి : మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు జరిగిన సమావేశాల్లో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీని కలిసిన మంత్రి 'డిజిటల్ ఇండియా' పై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో 'డేటా సెంటర్' ఏర్పాటుకు సహకారం కోరిన మంత్రి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సచివాలయం తరహా ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరారు. (‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’) గత 14 నెలల్లో రాష్ట్రాన్ని డిజిటలైజేషన్‌కు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపట్టామన్న మంత్రి ఎలక్ట్రానిక్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఈ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో జాతీయ స్థాయి ఐటీ సదస్సు కోవిడ్ కారణంగా జరగలేదని ప్రస్తావించిన మంత్రి మేకపాటిమరో ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ఐ.టీ కార్యదర్శి అజయ్ సాహ్నీని కోరారు. అదే విధంగా కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయతోమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. (రైతుల ఆదాయం రెట్టింపు కావాలి: సీఎం జగన్) 'సాగరమాల' పథకం కింద కాకినాడ పోర్టులో వసతుల కల్పన అభివృద్ధికి సహకరించాలని కోరిన మంత్రి 'భారతమాల' కార్యక్రమంలో భాగంగా పోర్టుల చుట్టూ జాతీయ రహదారుల అనుసంధానంపై చర్చించారు. భావనపాడు, కాకినాడ సెజ్ పోర్ట్, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల సమీపంలో జాతీయ రహదారుల నిర్మాణంపై కేంద్ర సాయాన్ని కోరారు. ఫిషింగ్ హార్బర్లో సరకు రవాణా, డీడబ్ల్యూటీ సామర్థ్యం పెంపు, హార్బర్ నిర్వహణలకు ఆర్థిక సహకారం అందించాలని కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయను కోరారు. (చక్కని వసతులు.. ఇంగ్లిష్ మాటలు) అనురాగ్ ఠాకూర్‌కు ఆహ్వానం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమైన మంత్రి ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు గురించి కేంద్ర సహకారంపై చర్చించారు. ఏపీలోని నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన నిధులు అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించాలని అనురాగ్ ఠాకూర్‌కు ఆహ్వానం అందించారు. పారిశ్రామిక వేత్తలతో ఒకసారి సమావేశం అవ్వాలని కోరారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ ముగిసింది. కరోనా సంక్షోభ కాలంలో చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను పీయుష్ గోయల్ అభినందించారు. విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి గురించి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పది ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయబోతుందని, దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒక మేజర్ పోర్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాలనుకుంటుందని, దానిపై ముఖ్యమంత్రితో మాట్లాడి ముందుకెళ్తామని తెలిపారు. ఏపీకి అభినందనలు ‘బొబర్తి ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుపై చర్చించాము. దీన్ని అతిపెద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్ గా అభివృద్ధి చేస్తాం. ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఏపీ ఒక లీడింగ్ స్టేట్‌గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం కస్టమ్ మెడ్ పాలసీ తీసుకువస్తాం. అసోసియేటెడ్ డ్రగ్స్ పార్కు కోసం ప్రత్యేక పార్కు తీసుకు వస్తున్నాం. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు గురించి చర్చించాం. దీని పైన ఒక కమిటీ వేసి చెబుతామని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సులభతర వాణిజ్యంలో నెంబర్ వన్‌గా నిలిచిన ఏపీని అభినందించారు. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మెరుగుపరచాలని కోరారు. ఎమ్ఎస్ఎమ్ ఈ రంగానికి 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మూడు నెలల పాటు ఫిక్స్డ్ ఛార్జీలు తీసివేయడం వల్ల చాలా పరిశ్రమలకు ప్రయోజనం కలిగింది.’ ‘పరిశ్రమలకు రాయితీలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి విజన్‌ను గోయల్ అభినందించారు. పెట్టుబడులకు రాష్ట్రాల సన్నద్ధత, ఈ - గవర్నెన్స్ గురించి చర్చించాం. రక్షణ రంగానికి సంబంధించి 108 వస్తువులను దేశీయంగా తయారు చేసే అంశంపై ఒక బ్లూప్రింట్ రూపొందిస్తున్నారు. దొనకొండను రక్షణ పరికరాల తయారీ క్లస్టర్ గా మారుస్తాం. దీనిపై రేపు ఎయిర్ చీఫ్ మార్షల్, నేవీ చీఫ్ తో మాట్లాడుతా. విశాఖపట్నంలో సబ్‌మెరైన్ బేస్ ఉంది. ఈ రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంశంపై కూడా చర్చిస్తాం.’ అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. -
‘ఏపీలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం వెళ్లిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తొలి రోజుజరిగిన సమావేశాల్లో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిశారు. బుధవారం ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో ఉద్యోగావకాశాలు, శిక్షణకు సంబంధించిన సహకారాన్ని గౌతమ్ రెడ్డి కోరారు. (ఆంధ్రప్రదేశ్ నంబర్ 1) 'హునర్ సె రోజ్ గర్' కార్యక్రమంలో భాగంగా పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని ఐటీడీసీ ఛైర్మన్ తెలిపారు. హోటల్ మేనేజ్ మెంట్, వివిధ రకాల వంటలలో ప్రత్యేక శిక్షణ, పర్యాటకరంగంలో ఉద్యోగాల కల్పనకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రతిపాదనలకు కమలవర్ధనరావు సానుకూలంగా స్పందించారు. అనంతరం, ఢిల్లీలోని లోథి హోటల్లో మంత్రి మేకపాటి జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ సీఎండీ గురుదీప్ సింగ్‌ను కలిశారు. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఎన్టీపీసీ సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం మంత్రి మేకపాటి ప్రతిపాదనపట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. మంత్రి మేకపాటి కోరిన విధంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు, అప్రెంటిషిప్ కార్యక్రమాలలో భాగస్వామ్యానికి ఎన్టీపీసీ సీఎండీ సంసిద్ధత వ్యక్తం చేశారు. (తొమ్మిది గంటలు ఎంత వాడినా ఫ్రీనే) ఆ తర్వాత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనిల్ కుమార్ చౌదరితో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి గౌతమ్ రెడ్డి సెయిల్ సీఎండీకి వివరించారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ద్వారా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. సీవోఈ ఏర్పాటుపై చర్చించి నిర్ణయం చెబుతామని ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చౌదరి మంత్రి ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. అయితే హెచ్ఆర్డీ కేంద్రాల ద్వారా పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులకు, ఇంజనీరింగ్ యువత రాసే 'గేట్' పరీక్షలకు , అప్రెంటిషిప్ కార్యక్రమాలకు, శిక్షణలో తోడ్పాటు అందిస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చారు. అగ్ని, గాలి , కరెంట్ కొలిమిలలో యువతకు శిక్షణ, ఉద్యోగావకాశాలకు ఎమ్ఎస్ఎమ్ఈ శాఖ భాగస్వామ్యంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కృషి చేస్తుందని మంత్రి మేకపాటి ప్రతిపాదనకు అనిల్ చౌదరీ బదులిచ్చారు. ప్రతి రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణతో పాటు రాష్ట్రంలో స్కిల్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు కోసం మంత్రి మేకపాటి తొలి రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశమయ్యారు. సీఎండీలతో సమావేశాలలో మంత్రి మేకపాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ హాజరయ్యారు. గురువారం కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయను పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి సమావేశమవుతారు. -
విద్యార్థిని స్నానం చేస్తుండగా.. చిత్రించిన వ్యక్తి అరెస్ట్
నాగార్జున యూనివర్సిటీ అతిథి గృహంలో స్నానం చేస్తున్న విద్యార్థినిని ఓ యువకుడు సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఇది గుర్తించిన యువతి బిగ్గరగా కేకలు వేయడంతో అప్రమత్తమైన తోటి విద్యార్థులు దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేక.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ‘జెర్మి ట్రైన్ ద ట్రైనీ’ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఛత్తిస్‌గఢ్ రాయ్‌పూర్ నుంచి విద్యార్థినుల బృందం నాగార్జున యూనివర్సిటీకి వచ్చింది. వీరికి యూనివర్సిటీ అతిథి గృహంలో బస ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఓ విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తుండగా.. తలుపు పై భాగం నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యలను తన సెల్ఫోన్లో బంధించాడు. ఇది గుర్తించిన విద్యార్థిని గట్టిగా కేకలు వేసింది. దీంతో అతిథిగృహ సిబ్బంది యూనివర్సిటీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియల్ టూర్ కోసం వచ్చిన ఓ కళాశాలకు చెందిన బీబీఏ విద్యార్థులు ఈ ఘటనకు ప్పాలడి ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనుమానం వచ్చిన అందరి సెల్ఫోన్లను సేకరించి అందులోని చిత్రాలను పరిశీలించారు. ఈ దర్యాప్తులో సాయి శ్రీకర్ అనే విద్యార్థి ఈ చర్యకు పల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. శ్రీకర్ అనంతపురం జిల్లా పామిడి కి చెందిన వాడిగా గుర్తించారు. -
మైసూర్ లో తెలుగు విద్యార్థి మృతి
రాజమండ్రి : కర్ణాటక రాష్ట్రానికి ఇండస్ట్రియల్ టూర్‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. టూర్ లో భాగంగా వాటర్‌ఫాల్‌లో ఈతకు దిగి మునిగి పోయాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అజయ్‌కుమార్(18) చెన్నైలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ ఇండస్ట్రియల్ టూర్ కోసం విద్యార్థులు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. గురువారం ఓ వాటర్ ఫాల్ లో ఈతకు దిగిన అజయ్ ప్రమాదవశాత్తూ మునిగి పోయాడు. అతని మృతదేహం కోసం గాలించగా శుక్రవారం బయటపడింది. అజయ్ మరణవార్తతో అతని స్వగ్రామం రాజమండ్రి మండలం బొమ్మూరు విషాదచాయలు అలుముకున్నాయి. అజయ్ తండ్రి గురువారం రాత్రి మైసూరుకు బయలుదేరి వెళ్లారు. సంఘటన గురించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.